విమానంలోనూ ఈవ్ టీజింగ్ - తెలుగు వ్యక్తిపై కేసు నమోదు

Man caught inappropriately touching sleeping woman

11:16 AM ON 4th August, 2016 By Mirchi Vilas

Man caught  inappropriately touching sleeping woman

విమానంలో తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు అమెరికాలో ఓ తెలుగు వ్యక్తిమీద అభియోగం నమోదైంది. యూఎస్ అటార్నీ కార్యాలయం(న్యూజెర్సీ) తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన కూనం వీరభద్రరావు (58) జూలై 30న లాస్ఏంజెలెస్ నుంచి న్యూజెర్సీకి వెళ్లే విమానంలో ప్రయాణించారు. అయితే, ఆయన పక్కనే ఒక మహిళ కూర్చోగా, ఆమె పక్కన ఆమె సహచరుడు ఉన్నారు. ప్రయాణం మధ్యలో ఆమె నిద్రపోయింది. నిద్ర లేచి చూసేసరికి ఆయన (వీరభద్రరావు) చేయి తన జననావయవాలపై ఉందని, ఆయన కాలుతో తన కాలుని తడుముతున్నారని ఆమె ఫిర్యాదు చేసింది. వెంటనే ఆమె తన సహచరుడికి ఆ విషయం చెప్పగా, అతడు వీరభద్రరావుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

‘కావాలంటే డ్రింకు కొనిస్తా, జరిగినదాన్ని మరిచిపోవాలి' అంటూ వీరభద్రరావు సూచించినట్టు బాధితులు పేర్కొన్నారు. దీనికి అంగీకరించని ఆ జంట విమానం సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వెంటనే వారు వీరభద్రరావును వేరే సీటులోకి మార్చారు. విమానం నెవార్క్కు చేరగానే ఎఫ్బీఐ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని నెవార్క్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు. 50 వేల డాలర్ల (దాదాపు రూ.33 లక్షలు) సెక్యూర్ బాండ్పై వీరభద్రరావు ప్రస్తుతానికి విడుదలయ్యారు. ఆయనపై అభియోగాలు రుజువైతే రెండేళ్ల జైలు శిక్ష, రూ.1.66 కోట్ల జరిమానా పడే అవకాశం ఉంది.

ఇది కూడా చూడండి: సడన్ గా ఈమెకు ఏమైంది?

ఇది కూడా చూడండి: కాజల్ ఇలా హడలు గొడుతూ రివేంజ్ తీర్చుకుంటోందా ?

ఇది కూడా చూడండి: గుడిలో ఎందుకు కూర్చోవాలి? ఆశ్చర్యపరిచే లాజిక్ ఇదే

English summary

Indian Man caught inappropriately touching sleeping woman on Virgin America flight.