అతడిని నమ్మిన పాపానికి ... ఆ అమ్మాయిని 50 వేలకు అమ్మేసాడు!

Man Cheating His Girlfriend For 50 Thousand Rupees

10:53 AM ON 12th December, 2016 By Mirchi Vilas

Man Cheating His Girlfriend For 50 Thousand Rupees

ఎన్ని చట్టాలు చేసినా మహిళల పాలిట అవి కల్పతరువు కాలేకపోయాయి. బ్రోకర్లు, మోసగాళ్ల బారిన పడి ఇంకా చాలాచోట్ల అమ్మాయిలు మోసపోతూనే వున్నారు. తాజాగా జరిగిన ఈ ఉదంతం చూస్తే, ఒళ్ళు గగుర్పొడుస్తుంది. "హైదరాబాద్ లో అదృశ్యమైన మైనర్ బాలిక విజయవాడ వ్యభిచార గృహంలో దొరికింది.

ఒక కుర్రాడు ప్రేమ పేరిట ఆ అమ్మాయికి గాలమేసాడు. లేచి పోయి బెజవాడ లో పెళ్లి చేసుకుందామన్నాడు. అమ్మాయి అతని మాటలు నమ్మింది. విజయవాడ వెళ్లారు. హోటల్లో రూమ్ తీసుకున్నారు. అతగాడు మాయ మాటలు చెప్పి అమ్మాయిని లోబర్చుకున్నాడు. ఎంజాయ్ చేసాడు.

ఏలూరు వెళ్లి డబ్బు తీసుకుని వస్తానని చెప్పి ఆ అమ్మాయిని ఫ్రెండ్ రూమ్ లో వదిలి వెళ్ళాడు.

ఆ స్నేహితుడు కూడా తెల్సిన ఆంటీ వాళ్ళింట్లో ఉండొచ్చు అని నమ్మించి వ్యభిచార గృహ నిర్వాహకురాలికి 50 వేలకు అమ్మాయిని అమ్మేశాడు.

అక్కడ ఓనరమ్మ ఊరుకుంటుందా బలవంతంగా వ్యభిచారం చేయించింది. నేను అలాంటి దాన్ని కాదు అన్న వినలేదు . కాళ్ళ మీద ఏడ్చినా కనికరం చూపలేదు. నానా హింసలు పెట్టింది.

ఆ హింస భరించడం కంటే ఓనరమ్మ చెప్పింది చేయడమే మేలు అనుకుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక, తల్లిదండ్రుల పరువు తీయలేక బాధితురాలు వ్యభిచార కూపంలో ఉండిపోయింది."

సరిగ్గా అదేసమయంలో ఆ అమ్మాయి సెల్ ఫోన్ ట్రాకింగ్ చేసిన సీఐడీ అధికారులు కాల్ డేటా ఆధారంగా విచారణ సాగించారు. చివరికి ఆ వ్యభిచారకూపం నుంచి ఆ అమ్మాయికి విముక్తి కల్పించారు.

కేవలం ఈ కేసు కాకుండా ప్రస్తుత విచారణలో పలు మిస్సింగ్ కేసులు బయటపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగం పేరుతో మాయమాటలు చెప్పి గుంటూరు, ఏలూరుకు చెందిన వ్యభిచార ముఠాకు చెందిన ఇద్దరు నిర్వాహకులు మైనర్లను కొనుగోలు చేస్తున్నట్టు సీఐడీ దర్యాప్తులో బయట పడింది. ఇలాంటి హైటెక్ ముఠాలను పట్టుకొనేందుకు పోలీసులు వేటసాగిస్తున్నారు. ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను మహారాష్ట్రలోని నాగపూర్, యావత్ మల్, చంద్రాపూర్ కు తరలించి వ్యభిచార కూపంలో దించుతున్న 16మంది నిర్వాహకులను గతేడాది సీఐడీ కటకటాల్లోకి నెట్టింది. అదేవిధంగా ఏలూరు, గుంటూరుకు చెందిన ముఠా నిర్వాహకులు దొరికితే వారి నెట్ వర్క్ ను చేధించాలని అధికారులు భావిస్తున్నారు. ఇద్దరు బ్రోకర్లు పట్టుబడితే 100 నుంచి 150 మంది యువతులకు విముక్తి కలిగించవచ్చనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు. అమ్మాయిలూ బహు పరాక్ అంటున్నారు పోలీసులు.

ఇది కూడా చూడండి: పోలి స్వర్గానికి వెళ్లడం అంటే ఏమిటో తెలుసా?

ఇది కూడా చూడండి: స్త్రీల గురించి చాణక్యుడు చెప్పిన అపురూప విషయాలు

English summary

Man Cheating His Girlfriend For 50 Thousand Rupees