కోర్టు దగ్గరే భార్య గొంతు కోసేశాడు

Man Cuts His Wife Throat on Court Premises in Hyderabad

10:37 AM ON 12th April, 2016 By Mirchi Vilas

Man Cuts His Wife Throat on Court Premises in Hyderabad

అంతులేని దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్‌లో దారుణం జరిగిపోయింది. కోర్టు ఆవరణలో ఓ కసాయి భర్త అందరూ చూస్తుండగా భార్య గొంతు కోసేశాడు. వెంటనే అక్కడ నుంచి పరారయ్యాడు . లంగర్‌హౌజ్‌ ఏరియాకు చెందిన నాగేందర్‌బాబు- సౌజన్య దంపతులు.. విడాకులు కోసం ఏడాది కిందట రాజేంద్రనగర్‌ కోర్టుని ఆశ్రయించారు. పదేళ్ల కిందట వీరి వివాహం కాగా, ఏడేళ్ల కొడుకూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో నాగేందర్‌.. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవడం లేదంటూ సౌజన్య కోర్టును ఆశ్రయించింది. తన కుటుంబ ఖర్చులు చెల్లించేలా భర్తను ఆదేశించాలని అందులో విజ్ఞప్తి చేసింది. ఐతే, ఈ కేసు విచారణ సోమవారం కోర్టుకు ముందుకొచ్చింది.. ఈ దంపతులు న్యాయస్థానానికి వచ్చారు. విచారణ పూర్తయిన తర్వాత సౌజన్య బయటకు వస్తున్న సమయంలో నాగేందర్‌బాబు తన వెంట తెచ్చుకున్న కత్తితో భార్య గొంతుకోసి, పారిపోయాడు. రక్తపు మడుగులో వున్న ఆమెను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు . దీంతో కోర్టు ఆవరణలో భయానక వాతావరణం నెలకొంది.

ఇవి కూడా చదవండి:

సర్దార్ మూడు రోజుల కలక్షన్స్

ఆ హీరోయిన్ కాళ్ళు నొక్కిన హీరో

తొలిరాత్రి కన్య కాదని భార్యను చంపేసాడు

English summary

A Man who belongs to Ranjendra Nagar in Hyderabad Cuts his wife Throat on Court Premises. They two were applied for divorce and they attended for court.