ప్రాణం తీసిన సెల్ఫీ

Man died hitting train when he tried to take selfie

05:42 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Man died hitting train when he tried to take selfie

పాకిస్తాన్ లోని జంషెద్‌ ఖాన్‌ అనే 22 ఏళ్ళ యువకుడు రైలు పట్టాల పై నిలబడి సెల్ఫీ తీసుకుంటూ రైలు గుద్ది చనిపోయాడు.

వివరాల్లోకి వెళ్తే 22 ఏళ్ళ జంషెద్‌ ఖాన్‌ పాకిస్థాన్‌ లో రైల్వే ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అయితే జంషెద్‌ రావల్పిండి లోని రైలు పట్టాల పై నిలబడి తన ఫోన్లో సెల్ఫీ తీసుకునేందుకు నిలబడ్డాడు. ఈ లోగా వేగంగా వచ్చిన రైలు జంషెద్‌ ఖాన్‌ పై నుండి దూసుకెళ్ళింది, దీంతో జంషెద్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ విషయాన్ని డీబా షానాజ్‌ అనే సీనియర్‌ రైల్వే రెస్యూ డిపార్టుమెంట్‌ అధికారి మీడియాకు వివరించారు.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు జంషెద్‌ మరణ వార్తను అతని తండ్రి మహ్మద్‌ పర్వేజ్‌కు తెలియజేయగా అతను మాత్రం తన కొడుకు సెల్ఫీ తీసుకొంటూ చనిపోలేదని, తన కొడుకు పట్టాలు దాటుతుండగా రైలు గుద్ది చనిపోయాడని ఆరోపించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జంషెద్‌ మృతికి గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.

English summary

A 22 year old railway employee named Jamshed Kahn ha died by taking a selfie on the railway track in pakistan