మద్యం అనుకుని తాగేసి ......

Man Drinks Pesticide Instead Of Alcohol

11:35 AM ON 19th January, 2016 By Mirchi Vilas

Man Drinks Pesticide Instead Of Alcohol

మద్యానికి, పురుగుల మందుకి తేడా తెలీలేదా, తెల్సి తాగేసాడా, తెలీక తాగాడా .... అవును మద్యం అనుకొని ఓ వ్యక్తి పురుగుల మందు తాగేసి, ప్రాణాలు కోల్పోయిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు పరిశీలిస్తే , మధ్యప్రదేశ్ బుర్హాన్‌పూర్‌ ప్రాంతానికి చెందిన దిలీప్‌జైకర్‌(36) నెల రోజుల క్రితం తన భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. ఇక రోజూ పీకల దాకా మద్యం సేవించేవాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి తన ఇంట్లో ఉన్న పురుగుల ముందు డబ్బాను మద్యం సీసా అనుకుని తాగేశాడు. దీంతో అస్వస్థతకు గురయిన అతన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే దిలీప్‌ బైకర్‌ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English summary

A man named dileep jaikar from madhya pradesh drinks pesticide by thinking it was alcohol bottle and later he died in hospital