చిన్నారికి బీర్ తాగించి .. అప్ లోడ్ చేసేసాడు .. ఆతర్వాత ...(వీడియో)

Man Feeding Alcohol To Baby Viral Video

12:34 PM ON 4th August, 2016 By Mirchi Vilas

Man Feeding Alcohol To Baby Viral Video

వేయి వెర్రి విధాలు అన్నారు కదా. ఓ ప్రబుద్ధిడికి ఏదోవిధంగా హైలైట్ కావాలని భావించి, చేయరాని పని చేసాడు. నార్మల్గా చేస్తే ఫలితం వుండదని ఏకంగా చిన్నారి నోట్లో పాల సీసాకు బదులు బీర్ బాటిల్ పెట్టి తాగించేసాడు.. పోనీ అంతటితో ఊరుకోలేదు, ఈ తతంగం మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేసాడు. ఇంకేముంది క్షణాల్లో ప్రపంచమంతా వ్యాపించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్రా ఆగ్రహం మొదలైంది. ఎవరు.. ఎక్కడ అనేది ఇప్పటివరకు తెలీదు. వీడియోలోని వ్యక్తి పోలికలు క్లియర్గా లేవు.

ఊహ తెలియని చిన్నారికి మద్యం తాగించడమేమిటని మండిపడుతున్న వాళ్లూ లేకపోలేదు. ఇక కేంద్ర మహిళా శిశుసంక్షేమ శాఖ కూడా తీవ్రంగా స్పందించింది. ఈ వీడియోలోవున్న వ్యక్తి ఎవరికైనా తెలిస్తే ఆయన డీటేల్స్ తమ ఈమెయిల్ ఐడీ (min-wcd@nic.in) కి పంపాలని కోరింది. సరదా కోసమైనా చిన్నారులతో ఇలాంటి వికృతమైన ఫీట్లు చేయించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి వాటికి కఠిన శిక్షలు వుండాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary

Man Feeding Alcohol To Baby Viral Video.