తలనొప్పి వస్తే వాళ్ళేం చేస్తున్నారో తెలిస్తే షాకవ్వాల్సిందే(వీడియో)

Man having blood drained from his forehead

03:52 PM ON 5th October, 2016 By Mirchi Vilas

Man having blood drained from his forehead

ఎంత కమ్యూనిస్టు దేశమైనా అనేక వింతలకు, విడ్డూరాలకు నిలయంగా చైనా ఉందని అంటారు. అక్కడి మనుషుల అలవాట్లతో పాటు ఆచారాలు కూడా వింతగానే ఉంటాయి. మన దగ్గర ఎవరికైనా తలనొప్పి వస్తే ట్యాబ్లెట్స్ వేసుకునో, జెండూబామ్ రాసుకునో విశ్రాంతి తీసుకుంటాం. కొద్దిసేపటికి నొప్పి నుంచి విముక్తి లభిస్తుంది. కానీ చైనాలోని కొన్ని ప్రాంతాల్లో తలనొప్పి వస్తే తగ్గించడానికి అత్యంత దారుణమైన సాంప్రదాయాన్ని ప్రజలు అవలంభిస్తున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలనే నానుడిని బాగా వంటబట్టించుకున్నట్టున్నారు. తలనొప్పిగా ఉంటే అక్కడ పొడిచి రక్తాన్ని బయటకు తీస్తున్నారు.

సూదితో గుచ్చి రక్తాన్ని ఓ టబ్ లో పడుతున్నారు. అలా రక్తం పోతే తలనొప్పి పోతుందని వారి నమ్మకం. ఈ తతంగాన్ని ఎవరో వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. అసలు వాళ్లు ఏం చేస్తున్నారో చూడాలంటే ఈ వీడియోపై ఓ లుక్కేయ్యాల్సిందే.

English summary

Man having blood drained from his forehead