మాజీ భర్తతో కలిసిందని తల నరికేసి... కవరులో పెట్టి పూడ్చారు

Man In Delhi Killed His Wife Ex Husband

10:59 AM ON 8th September, 2016 By Mirchi Vilas

Man In Delhi Killed His Wife Ex Husband

నేరాలకు అంతు లేకుండా పోతోంది. క్షణికావేశంలో ప్రాణాలు తీసేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఢిల్లీలో చోటుచేసుకుంది. మొదటి భర్తకు విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకున్నాక కూడా తన భార్య మళ్లీ మాజీ భర్తను కలుస్తోందని ఆగ్రహించిన సదరు వ్యక్తి తల నరికి చంపేశాడు. ఈ ఘటన న్యూఢిల్లీలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే, గుర్గామ్ కు చెందిన రోహిత్ అనే 25 ఏళ్ల యువకుడు 2013వ సంవత్సరంలో ప్రియాంక అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి మధ్య ఏర్పడిన వివాదంతో గత ఏడాది రోహిత్, ప్రియాంకలు విడాకులు తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రియాంక గుర్గామ్ ప్రైవేటు క్యాబ్ డ్రైవరుగా పనిచేస్తున్న ముకేష్ ను రెండో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ప్రియాంక ప్రతిరోజూ మాజీ భర్తను కలుస్తోంది.

మాజీ భర్తను కలవడంపై ముకేష్ భార్య ను నిలదీసాడు. ఆమెతో గొడవపడినా ఆమె వినలేదు. అంతే ముకేష్ భార్య సోదరుడైన ఆనంద్, అతని ఇద్దరు స్నేహితులు అష్రఫ్, విజయ్ లతో కలిసి భార్య మాజీ భర్త రోహిత్ ను హతమార్చేందుకు వ్యూహం పన్నాడు. మందుపార్టీకి రమ్మని మంగోల్ పురి ప్రాంతానికి పిలిపించి రోహిత్ తో మద్యం తాగించారు.ఆపై లాంగ్ డ్రైవ్ కు వెళదామంటూ ద్వారకా- గుర్గామ్ ఎక్స్ ప్రెస్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువచ్చారు.

పథకం ప్రకారం విజయ్ రోహిత్ ను తలపై కొట్టడంతో అతడు స్పృహతప్పాడు. ఆపై రోహిత్ తలను నరికారు. అక్కడే గుంత తవ్వి రోహిత్ మొండాన్ని అందులో వేసి దహనం చేశారు. రోహిత్ తలను పాలథీన్ కవరులో చుట్టి ద్వరకా పార్కులో పూడ్చిపెట్టారు. మాజీ భర్త రోహిత్ తో భార్య సంబంధం పెట్టుకుందనే ఆగ్రహంతో ప్రస్థుత భర్త ముకేష్ తన స్నేహితులు, బామ్మర్ధితో కలిసి హతమార్చినట్లు ఢిల్లీ డీసీపీ విక్రమ్ జిత్ సింగ్ చెప్పారు. ఈ హత్య కేసులో నిందితులైన నలుగురిని అరెస్టు చేసారు.

ఇవి కూడా చదవండి:చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్న సింగర్

ఇవి కూడా చదవండి:చిన్నారిని కారులో వదిలేసి.. డోర్ లాక్ చేసి ... ఆ జంటఏం చేసారో తెలుసా

English summary

A Man Named Rohit Kumar of Age 25 was married to Priyanka and they two were broked up with divorce after one year of the marriage. Later Priyanka was married to a private cab driver guy named Mukesh. Priyanka used to meet her ex-husband Rohit everyday. Mukesh said his wife many times not meet her ex-husband then mukesh got angried nad killed priyanka ex-husband with the help of his friends. Rohit Kumar's father filed case on this and Delhi police chased this case successfully and arrested Mukesh and his friends.