హెయిర్‌ స్టైల్‌ నచ్చలేదని 8 మందిని నరికేశాడు 

Man Killed His Wife And His Family For HIs Son's Ugly Hair Style

01:48 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Man Killed His Wife And His Family For HIs Son's Ugly Hair Style

తన కొడుకు చేయించుకున్న హెయిర్‌ స్టైల్‌ నచ్చలేదని కోపంతో ఊగిపోయిన ఒక తండ్రి ఏకంగా తన కుటుంబంలో వారందరిని అతి కిరాతకంగా నరికి చంపాడు. ఇంతటి దారుణమైన ఘటన రష్యాలో చోటుచేసుకుంది.

రష్యాలో ఓలెగ్‌ బోలోవ్‌ అనే వ్యక్తి తన భార్య, ఆరుగురు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. ఓలెగ్‌ భార్య తన ఆరు సంవత్సరాల వయసున తమ కొడుక్కి కాస్త వైరటీగా ఉండేలా జుట్టు కత్తిరించింది. అయితే ఓలెగ్‌ కు తన కొడుకు హెయిర్‌ స్టైల్‌ నచ్చకపోవడంతో తన భార్యను నిలదీశాడు. ఈ గొడవ అంతకంతకు పెద్దదైంది. దీంతో తన భార్య విడాకులు ఇస్తాననడంతో కోపంతో ఊగిపోయిన ఓలెగ్‌ తన భార్య గర్భవతి అని కూడా చూడకుండా తమ పిల్లల ముందే తన భార్యను గొడ్డలితో నరికి చంపాడు. ఆ తరువాత తన ఆరుగురు పిల్లల్ని కూడా విచక్షణారహితంగా గొడ్డలితో ఒక్కొక్కరిని నరికేశాడు. అంతటి తో ఆగకుండా తన తల్లి నివసిస్తున్న ఇంటికి వెళ్ళిన ఓలెగ్‌ ఆమెను కూడా నరికిచంపి ఆ శవాలు అన్నింటీని ప్లాస్టిక్‌ సంచుల్లో కుక్కేసాడు. ఆ తరువాత నేరుగా కోర్టుకు వెళ్ళిన ఓలెగ్‌ తాను చేసిన విషయాన్ని న్యాయమూర్తికి చెప్పి కోర్టులో లొంగిపోయాడు. తాను చేసిన తప్పును ఒప్పుకున్న ఓలెగ్‌ కు కోర్టు యావజ్జీవ జైలు శిక్షను విధించింది.

English summary

A man named Oleg Belov was killed his pregnant wife and his six children and his mother for his sons variety hair style. Later he was surrendered in court and court jailed him. This incident was occured in Russia