ప్రాణం తీసిన ఆమ్లెట్

Man Killed His Wife For Omlet

01:09 PM ON 16th February, 2016 By Mirchi Vilas

Man Killed His Wife For Omlet

ఆమ్లెట్ ఏంటి ప్రాణం తియ్యడం ఏంటి .? అసలు ఆమ్లెట్ ప్రాణాలు ఎలా తీస్తుంది.. ఏం మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా..! ఆగండి అక్కడికే వస్తున్నాం.....

వివరాలోకి వెళ్తే.....హైదరాబాద్ లోని పహదిషరిఫ్ లో నివాసం ఉంటున్న నరేష్ ఆటో నడుపుతూ తన కుటుంభాన్ని పోషిస్తున్నాడు. గత ఆదివారం రాత్రి ఫుల్ గా మద్యం తాగి ఇంటికి వచ్చిన నరేష్ తన భార్య సందేశమ్మ ను ఆమ్లెట్ వెయ్యమని కోరాడు.

అసలే తన భర్త కోపిష్టి అని తెలిసిన సందేశామ్మ ఆలస్యం చెయ్యకుండా వెంటనే తన భర్త అడిగిన ఆమ్లెట్ ను తాయారు చేసి తీసుకువచ్చి నరేష్ పడుకున్న మంచం మీద పెట్టింది. కాని అప్పటికి నరేష్ ఫుల్ గా తాగడంతో మత్తులో లేవలేకపోయాడు. దీంతో అక్కడే ఉన్న నరేష్ చిన్న కుమారుడు అక్కడ ఉన్న ఆమ్లెట్ ను తినయడంతో కోపంతో ఊగిపొయిన నరేష్ తన భార్య సందేశామ్మ ఒంటి పై కీరోసిన్ పోసి నిప్పంటించాడు.

నిప్పంటించడంతో గట్టిగా కేకలు పెట్టిన సందేశమ్మను గుర్తించిన చుట్టూ ప్రక్కల వారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించాగా ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు . దీంతో నరేష్ అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నరేష్ పై హత్యయత్నం కేసు నమోదు చేసి నరేష్ కోసం వెతికే పనులో పడ్డారు.

English summary

An Auto Driver Named Naresh who belongs to Pahadisharif in Hyderabad attempted to kill his wife for Omlet.Naresh On Sunday he was fully drinked and came to his home and asked his wife to prepare omlet and she prepared omlet but his son ate that omlet and due to that he severly beat his wife and Burned her with kerosene.Presently she was in critical condition in Hospital .Police filed case on him and searching for Naresh.