విషాదం నింపిన రిహార్సల్స్

Man Killed In Rehearsals in japan

04:06 PM ON 17th February, 2016 By Mirchi Vilas

Man Killed In Rehearsals in japan

సమాజాన్ని చైతన్య పరిచే శక్తి నాటకానికి వుంది. అందుకే నాటకంలో నటించే, కళాకారులు ఎంతో రాణింపు కనబరుస్తారు. నాటక నేపధ్యం గల నటులు సినిమాల్లో అవలీలగా రాణిస్తారు. అందుకే గతంలో సినిమాల్లోకి వచ్చేవాళ్ళకు నాటక అనుభవం తప్పనిసరిగా వుండేది. అలాంటి నాటకంలో నటీనటులు లీనమై నటించేటప్పుడు ఒక్కోసారి అనుకోని విషాదం కూడా చోటుచేసుకుంటుంది. మహిషాసుర మర్దనం నాటకంలో అమ్మవారి పాత్రలు వేసిన వాళ్ళు నిజంగానే శూలంతో మహిషాసురుని పాత్రధారుని పొడిచిన సందర్భాలు చాలానే వున్నాయి. అయితే ఇటీవల ఓ జపనీస్ నాటకం కోసం చేస్తున్న రిహార్సల్స్ కూడా విషాదాంతమయ్యింది. కత్తి యుద్ధం నేపథ్యంలో జరిగే ఓ నాటకానికి రిహార్సల్స్ చేస్తున్న సమయంలో 33 ఏళ్ల డిగో కాషినో ప్రమాదవశాత్తు కత్తిపోటుకు గురయ్యాడు. అయితే అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. టోక్యోలోని స్టూడియోలో రిహార్సల్స్ సెషన్ నడుస్తుండగా, పదునైన కత్తి డిగో కడుపులో దిగటంతో ప్రమాదం జరిగిందని పోలీసు అధికారులు వెల్లడించారు.

ఇక ఈ ఘటనకు ప్రత్యక్షసాక్షులు లేకపోవటం కూడా పలు అనుమానాలకు తావిస్తోందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారట. ఇతర నటీనటులు, గాయపడిన తరువాత అతని కేకలు విని స్పందించారు. అయితే అతను ఎలా గాయపడ్డాడనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు.దీంతో ఇది కేవలం ప్రమాదమేనా లేక మరేదైనా కుట్ర ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా గతం వారం ఇటాలియన్ ప్లే జరుగుతున్న సమయంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగిందట. రఫెల్ షూమేకర్ అనే ఇటాలియన్ నటుడు.. ఉరి సన్నివేశంలో నటిస్తుండగా ప్రమాదవశాత్తు ఉరితాడు బిగుసుకొని మరణించాడట.

English summary

An actor was fatally stabbed with a real or mock samurai sword while rehearsing a play at a Tokyo studio, and police are investigating whether his death was criminal or accidental.