స్మార్ట్ ఫోన్ ని పెళ్లాడాడు

Man marries his phone in America

12:55 PM ON 30th June, 2016 By Mirchi Vilas

Man marries his phone in America

అవునా అంటే, ఏమి చెబుతాం, ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ యాంత్రిగా యుగంలో , సాంకేతిక విప్లవం పుణ్యమా అని వింతలు ఇంకా పెరిగాయి. ఇప్పుడు ఓ వ్యక్తి కి జరిగిన పెళ్లి నిజంగా వింతే.. అమెరికాకు చెందిన ఆరోన్ చెర్వెనాక్ అనే ఈ వ్యక్తి చర్చిలో స్మార్ట్ ఫోన్ ని పెళ్ళాడాడు. ఆర్టిస్ట్, డైరెక్టర్ అయిన ఇతగాడు తన వైఫ్ గా స్మార్ట్ ఫోన్ ని ఎంచుకున్నాడు. లాస్ ఏంజిలిస్ నుంచి లాస్ వేగాస్ వరకు సుమారు 365 కిలోమీటర్లు ప్రయాణించి వివాహ వేదిక అయిన చర్చి వద్దకు చేరుకున్నాడు.

'నువ్వు ఈ స్మార్ట్ ఫోన్ ను చట్ట బద్దంగా భార్యగా చేసుకుంటావా' అని లాస్ వేగాస్ చాపెల్ యజమాని మైఖేల్ కెల్లీ అడగగానే ఎస్ అని ఆరోన్ చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. ఫోన్ వెనుక అమర్చిన ఉంగరంలో ఎడమచేతి వేలిని దూర్చి మేరేజ్ తంతు ముగించాడు. నాతో చాలా కాలంగా ఈ స్మార్ట్ ఫోన్ ఉందని, తన భావోద్వేగాలను దీనితో పంచుకుంటానని ఆరోన్ అంటున్నాడు. పైగా తన యూ ట్యూబ్ లో ఈ పెళ్లి యవ్వారం పోస్ట్ చేసాడు. ఇక నెవెడా రాష్ట్రం ఈ వింత వివాహాన్ని చట్టపరంగా గుర్తించడం కొసమెరుపు.

ఇది కూడా చూడండి: భూగర్భంలో అంతుచిక్కని మిస్టరీలు

ఇది కూడా చూడండి: జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణం అని ఎందుకంటారో తెలుసా?

ఇది కూడా చూడండి: శ్రీకృష్ణ ద్వారక గురించి ఆసక్తికరమైన విషయాలు

English summary

Aaron marries his smart phone in America.