చెట్టును పెళ్లాడిన నటుడు

Man Marries Tree In Mexico

11:15 AM ON 14th May, 2016 By Mirchi Vilas

Man Marries Tree In Mexico

ఇదో వింత...ఎందుకంటే,అబ్బాయిలు వివాహం చేసుకోవాలంటే మంచి అమ్మాయి కోసం వెతుకుతారు. అందమైన అమ్మాయి ఉంటే చూసిపెట్టండని తెలిసినవారికి చెబుతారు లేదా ఆన్‌లైన్‌లో వెతుకుతారు. మ్యారేజి బ్యూరోలను సంప్రదిస్తారు. కానీ పెరూకు చెందిన ఒక వ్యక్తి మాత్రం ఏకంగా ఓ చెట్టును పెళ్లాడాడు. అది కూడా సిక్రెట్ గా కాదండోయ్...పక్కా సంప్రదాయబద్దంగా వివాహం చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి:శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం-భక్తుల పూజలు

వివరాల్లోకి వెళ్తే, నటుడు, పర్యావరణ వేత్త రిచార్డ్‌ చోర్రెస్‌ 2వేల ఏళ్లు వయసు ఉన్న ఒక చెట్టును వివాహం పెళ్లి చేసుకుని అందరినీ విస్మమయపరిచారు. వివాహానికి చక్కని ముహూర్తం చూసుకుని మరీ ప్రముఖులు, బంధువుల సమక్షంలో రింగ్‌ తొడిగాడు. ప్రపంచంలోనే అత్యధిక వయసు ఉన్న వృక్షం ఇదేనని చెప్పుకుంటారు. వినూత్నంగా జరిగిన ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో పర్యావరణ వేత్తలను, స్థానికులను ఆహ్వానించాడు. వాయిద్యాల చప్పుళ్లతో ఆ చెట్టును ముద్దాడి వివాహం చేసుకున్నాడు.

ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికివేతను అరికట్టే లక్ష్యంతో పెరూ, అర్జెంటీనా, కొలంబియా దేశాల్లో అవాగాహన కార్యక్రమాలు చేపట్టాడు. ఎప్పటికప్పుడు అడవుల విధ్వంసం పెరిగిపోతుందని, ఇప్పటికైనా ప్రపంచ దేశాలు ప్రకృతి పరిరక్షణ చర్యలు చేపట్టాలని రిచార్డ్‌ చోర్రెస్‌ పిలుపునిచ్చారు. మొత్తానికి చెట్టుని జీవిత భాగస్వామిగా చేసేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి:రేపిస్ట్ నాలుక కొరికి తప్పించుకున్నయువతి

ఇవి కూడా చదవండి:బాహుబలి కలెక్షన్స్ పై బన్నీ షాకింగ్ కామెంట్స్

English summary

Environmentalist and Actor Richard Torres Marries a Ancient tree in Mexico. He gives message to all the people that not to cut trees. The age of this tree was more that 2 thousand years.