భార్యను చంపి ఫేస్‌బుక్‌లో ఫోటోలు పెట్టిన ప్రబుద్దుడు

Man Posted His Wife Dead Body Photos On Facebook

04:37 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Man Posted His Wife Dead Body Photos On Facebook

తన భార్యను చంపి ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌లో పెట్టాడో ప్రబుద్దుడు. విరరాల్లోకి వెళ్తే ఫ్లోరిడాకు చెందిన డెరెక్ అనే వ్యక్తికి తన భార్య జెన్నిఫర్‌ తో తలెత్తిన చిన్నగొడవ చిలికి చిలికి వానంతగా మారింది. డెరెక్ మీద అతని భార్య జెన్నిఫర్‌ చేయిచేసుకుంది. దీంతో అవమానంగా ఫీలైన డెరెక్ తన భార్యను గన్‌తో కాల్చి చంపాడు. ఆమె చనిపోయినప్పటికీ కోపం తీరని డెరెక్ రక్తపు మడుగులో ఉన్న తన భార్య మృతదేహాన్ని ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌ లో పెట్టాడు. నా భార్య నన్ను అవమానించింది, తట్టుకోలేక పోయానని డెరెక్ అన్నాడు . ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు డెరెక్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు డెరెక్ కు 25 ఏళ్ళ జైలు శిక్ష విధించింది.

English summary

A man named dereck kills his wife jennifer and posted her dead body photos on facebook. A small dispute occurted between them.Then he shoots his wife and posted her dead body photos.This incident was happened in florida.Police arrested Dereck and taken him to custody