యువతిని నమ్మించి అత్యాచారయత్నం, ఆపై ఏమైందంటే ...

man rape attempt on Hyderabad student

12:48 PM ON 6th February, 2017 By Mirchi Vilas

man rape attempt on Hyderabad student

మహిళలపై , విదార్థినులపై, చివరకు చిన్నారులపై కూడా అఘాయిత్యాలు మితిమీరిపోతున్నాయి. తాజాగా మరో యువతి వేధింపులకు గురైంది. వివరాల్లోకి వెళ్తే, హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని భరణి లే అవుట్ లో నివాసం ఉంటున్న 17 ఏళ్ళ యువతికి ఘట్ కేసర్ సమీపంలోని కళాశాలలో డిప్లోమోలో సీటొచ్చింది.

అయితే ఆమెకు సహయం చేస్తానని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎడ్చర్లకు చెందిన బానోతు రవి నమ్మించాడు. రవిని నమ్మి ఆ యువతి ఆతనితో పాటు మూడు దఫాలు కాలేజీకి వెళ్లింది.యువతి తనను నమ్మిందని భావించిన రవి ఆ యువతిపై అత్యాచారం చేయాలని ప్లాన్ వేశాడు.

అనుకున్నదే తడవుగా ఆ యువతిపై రవి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.అయితే ఈ విషయాన్ని ఆ యువతి నివాసం ఉండే ఇంటి యజమాని గుర్తించాడు. దీంతో నిందితుడు పారిపోయాడు. ఆతర్వాత ఆ యువతికి నిందితుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోలీసులు నిర్భయ, ఫోక్సో చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇది కూడా చూడండి: శంఖం ప్రత్యేకత ఏమిటో తెలుసా

ఇది కూడా చూడండి: 2017 లో మీ రాశిని బట్టి…. మీకు మంచి చేసే కలర్ ఇదే

English summary

a man rapped diploma student in jubileehills hyderabad.