20 ఏళ్ల జైలు శిక్ష.. తర్వాత నిర్దోషిగా ప్రకటన

Man Released After 20 Years Of Jail By Clearing Murder Case

07:10 PM ON 1st February, 2016 By Mirchi Vilas

Man Released After 20 Years Of Jail By Clearing Murder Case

ఓ హత్య కేసు.. అందులో దోషిగా ఓ వ్యక్తి 20 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే అతడు నిర్దోషి అని తాజాగా కోర్టు తీర్పును వెలువరించింది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనాలోని హైనాన్‌ ప్రావిన్స్‌లో చెన్‌మాన్‌ అనే వ్యక్తికి 1994 నవంబర్ లో ఓ హత్యకేసులో శిక్ష పడింది. అతడికి శిక్ష విధించిన చైనా తూర్పు ప్రాంతంలోని జెంజియాంగ్‌ ప్రావిన్స్‌ హైకోర్టే ఇప్పుడు అతడు హత్య చేశాడనడానికి సరైన ఆధారాలు లేవని నిర్దోషిగా ప్రకటించింది. చెన్‌మాన్‌ దరఖాస్తును పరిశీలించిన చైనా అత్యున్నత న్యాయస్థానం అతడి కేసును తిరిగి విచారణ చేపట్టాలని 2015 ఆగస్టులో ఆదేశించింది. పునర్విచారణలో అతడు నిర్దోషి అని తేలింది. చెన్‌మ్యాన్‌కు 50ఏళ్ల వయసులో శిక్ష పడగా.. 20ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. గతంలో కూడా ఇక్కడ ఇలాంటి తీర్పులు వెలువడ్డాయి. 1996లో మహిళపై అత్యాచారం, హత్య కేసులో 18ఏళ్ల యువకుడిని దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించారు. శిక్ష విధించిన తొమ్మిదేళ్ల తర్వాత మరో వ్యక్తి ఆ కేసులో దోషిని తానేనని అంగీకరించడంతో శిక్ష అనుభవించింది నిర్దోషి అని తెలిసింది. 2014లో కోర్టు దీన్ని నిర్ధారించింది. దీంతో నిర్దోషికి మరణశిక్ష పడడానికి కారణమైన 27 మందిపై చైనా చర్యలు తీసుకుంది. చైనాలో చాలా కేసుల్లో అసలు నేరస్తులు తప్పించుకుంటూ అమాయకులు చేయని తప్పిదం ఒప్పుకొనే పరిస్థితులు కల్పిస్తున్నారు. దాంతో ఇలాంటి పొరపాటు తీర్పులు వెలువడుతుండడం ప్రజాగ్రహానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం న్యాయవ్యవస్థలో పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తోంది.

English summary

A man jailed in China for 20 years for murder was acquitted on Monday, the latest in a series of wrongful convictions overturned in the country.