కట్నం ఇవ్వలేదని భార్యను అమ్మేసిన భర్త

Man Sells Her Wife For Not Giving Dowry

11:17 AM ON 18th February, 2016 By Mirchi Vilas

Man Sells Her Wife For Not Giving Dowry

తను అడిగిన కట్నం తీసుకురానందుకు ఏకంగా తన భార్యను అమ్మేశాడు ఒక భర్త. ఇలాంటి దారుణమైన ఘటన హర్యాణాలో చోటుచేసుకుంది.

వివరాలోకి వెళ్తే..ఒక మహిళ ఈ సంవత్సరం జనవరి 8వ తేదిన హర్యాణాకు చెందిన టికు పటికర్ అనే వ్యక్తిని కొంత మంది స్నేహితుల సమక్షంలో ఒక గుడిలో పెళ్లి చేసుకుంది.

ఇక్కడ వరకు బాగానే ఉంది కాని పెళ్ళైన కొద్ది రోజులకు టికు పటికర్ నిజ స్వరూపం బయటపడింది. టికు పటికర్ కుటుంబ సభ్యులు ఆమెను రోజు కట్నం కోసం చిత్రహింసలకు గురిచేసేవారు. టికు పటికర్ కుటుంబ సభ్యులు ఆమెను 2 లక్షల కట్నం , ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ను ఇవ్వాల్సిందిగా ఆమె కుటుంభాన్ని కోరగా ఆమె కుటుంభం వారు అంత డబ్బు ఇచ్చే అంత ఆర్దిక పరిస్థితి తమకు లేదని తాము ఇవ్వలేమని చెప్పారు.

దీంతో ఆగ్రహానికి గురైన టికు పటికర్ తనను నమ్మి వచ్చి ఏడడుగులు నడిచిన భార్యను శృంగార చిత్రాలు చిత్రీకరించే ఒక ముఠాకు 7 లక్షల రూపాయలకు అమ్మేశాడు. టికు పటికర్ తన భార్యను శృంగార చిత్రాలు చిత్రీకరించే ముఠాకు అప్పగించాలని చూస్తుండగా తన భర్త బుద్దిని పసిగట్టిన ఆమె అక్కడ నుండి తప్పించుకుని ఆమె తల్లిదండ్రుల వద్దకు చేరుకొని పోలీసులకు జరిగిన తతంగం అంతా చెప్పింది. తనను టికు పటికర్ ,అతని కుటుంభం సభ్యులు అంతా కట్నం కోసం తనను చిత్రహింసలకు గురి చేసేవారని , డబ్బు కోసం తన చేత కూలి పనులు కుడా చేయించే వారాని పోలీసుల ముందు వాపోయింది.

ఆ మహిళ పిర్యాదు మేరకు కంప్లైంట్ రిజిస్టర్ చేయించుకున్న పోలీసులు అతడి పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

English summary

A man named Tiku Patikar sells his wife to porn movie makers for not giving Dowry.This was occured in Haryana.He was married a woman on January 8th in 2016 in a temple with the support of a few of the people.After few days he and his family members tortured the woman to bring dowry which they asked.The woman family was refused to give that dowry because of their financial status.Then Tiku got angry and he sell his wife to Porn movie makers for 7 lakhs.Tiku wife identified this thing and got absconded from the place and went to her parents house and complained to police on this issue.