వామ్మో ఎంత పెద్ద బల్లో

Man Shocks By Seeing A Big Lizard In His House

11:02 AM ON 5th December, 2015 By Mirchi Vilas

Man Shocks By Seeing A Big Lizard In His House

గోడల మీద పాకుతూ ఇట్టే భయపడిపోయే బల్లి మనిషిని భయపెట్టడమేంటని అనుకుంటున్నారా ఆగండి అక్కడికే వస్తున్నాం.

బల్లి అంటే మామూలు బల్లి కాదు ఏకంగా 1.5 మీటర్ల పొడవున్న బల్లి గోడ మీద పాకుతూ కనిపిస్తే ఎలా ఉంటుంది , ఓసారి ఆలోచించండి . సరిగ్గా ఇలాంటి ఘటనే ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ ప్రాంతంలో జరిగింది.

వివరాల్లోని వెళ్తే ఎరిక్‌ హొలాండ్‌ అనే వ్యక్తి స్ధానికంగా ఒక షెడ్‌లో పనిచేస్తున్నాడు. తన పని ముగించుకుని ఇంటికి వచ్చిన ఎరిక్‌కు 1.5 మీటర్ల పొడవున్న ఉన్న బల్లి తన ఇంటి గోడ మీద పాకుతుండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఈ షాక్‌ నుండి తేరుకున్న ఎరిక్‌ తన కెమెరాతో దాన్ని ఫోటోలు కూడా తీసాడు.

ఈ ఘటన పై ఎరిక్‌ మాట్లాడుతూ షేడ్‌లో నుండి పని ముగించుకుని వచ్చిన ఎరిక్ కు ఈ భారీ బల్లి గోడమీద పాకుతుండడం చూసి షాక్‌ గురయ్యానని, వెంటనే ఇంటి లోపలికి వెళ్ళి కెమెరా తీసుకువచ్చి ఫోటోలు తీసానని చెప్పాడు. ఇలాంటి భారీ బల్లులు సాధారణంగా పొదల మధ్య జీవిస్తుంటాయని, ఇవి మనుషులను చూస్తే ఇట్టే పారిపోతాయని చెప్పాడు . ఈ బల్లులు కరిస్తే మాత్రం చాలా ఘోరంగా భాధపడాల్సి ఉంటుందని అన్నాడు.

ఈ బల్లి గురించి నిపుణులు మాట్లాడుతూ ఈ జాతి బల్లులు రెండు మీటర్ల వరకు పోడవు పెరుగుతాయని, ఇవి 20 కేజీల బరువు ఉంటాయని పేర్కొన్నారు.

English summary

A man named erik holland shocks by seeing 1.5 meter lizard crawling on the wall of his house.This incident occured in New South Wales ,Australia