తనతో పెళ్ళికి ఒప్పుకోలేదని కారులోనుంచి తోసేశాడు

Man Throws A Woman From Car For Refusing Marriage With Him

10:19 AM ON 29th April, 2016 By Mirchi Vilas

Man Throws A Woman From Car For Refusing Marriage With Him

దారుణాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఎక్కడా అంతూ పొంతూ వుండడం లేదు. తాజాగా వివాహానికి ఒప్పుకోలేదనే కోపంతో ఒక మహిళను కారులోనుండి తోసేశాడో దుర్మార్గుడు. ఈ సంఘటన ఆగ్రా-ఢిల్లీ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. మథురకు చెందిన యువతి ఆగ్రా-ఢిల్లీ జాతీయ రహదారిపై గల ఒక ఏటీఎంలో డబ్బు తీసుకోవడానికి వెళ్తుండగా ఆమెను ఒక వ్యక్తి కారులో వెంబడించాడు. కొద్ది దూరం వెళ్లిన తరువాత ఆ యువతిని బలవంతంగా కారులో ఎక్కించాడు. ఆమెను ఇష్టపడుతున్నానని చెప్పి వివాహనికి ఒప్పుకోవాలని వత్తిడి చేసాడు. దీనికి ఆ యువతి ససేమిరా అంగీకరించలేదు.

ఇవి కూడా చదవండి:మహేష్ అభిమానులకు దిమ్మ తిరిగే కానుక ఇచ్చిన పూరీ

దీంతో ఆగ్రహించిన ఆ యువకుడు దగ్గర సిద్ధంగా ఉంచుకున్న సుత్తితో ఆమె తలని కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్రంగా రక్తస్రావాలతో ఆ యవతి కేకలు పెడుతున్నా పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా ఆమెను కారు నుండి బయటకు తోసేశాడు. అక్కడి నుండి కారులో పారిపోయాడు. రోడ్డుపై ఆమెని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమెను వెంటనే అక్కడకు చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం యువతి మధురలో స్వర్ణ జయంతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆ యువతి ఒక పోస్ట్-గ్రాడ్యుయేట్, మార్చి 2016 వరకు ఒక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. పోలీసులు కేసు నమోదుచేసి, ఆమెను గాయపరిచిన ఆగంతకుడి కోసం గాలింపు చేపట్టారు.

ఇవి కూడా చదవండి:లోకేష్ పప్పు సుద్ద అంటూ విరుచుకు పడ్డ రోజా

ఇవి కూడా చదవండి:డ్రగ్స్ దందాలో చిక్కుకున్న టాప్ హీరోయిన్

English summary

A Man throws a woman from car for not accepting marriage with him in Delhi Agra Highway. He asked her to do marriage with him and she refused then the man used to beat the woman with Hammer and thrown her from car. Near by people saw her and taken her into hospital and she was taking treatment in hospital.