ఆగస్టు 5న 'మనమంతా' వచ్చేస్తోంది

Manamantha movie is releasing on August 5th

11:35 AM ON 18th July, 2016 By Mirchi Vilas

Manamantha movie is releasing on August 5th

సినిమాల రిలీజ్ జోరందుకుంది. ఈ క్రమంలో విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దాదాపు రెండేళ్ల తరువాత వారాహి చలన చిత్రం బ్యానర్ పై చేస్తున్న మనమంతా మూవీ ఆగస్టు 5వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో నమ్మదు, మలయాళంలో విస్మయం పేర్లతో విడుదల చేస్తున్నారు. సున్నితమైన మానవ సంబంధాలు, భావోద్వేగాలతో నిండిన మనిషి పెరుగుదలలో నాలుగు దశలైన బాల్యం, యవ్యనం, కౌమార, వృద్ధాప్య దశల్లో ఉన్న నలుగురు వ్యక్తుల జీవిత ప్రయాణమే ఈ చిత్రం. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్ లాల్, గౌతమి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మోహన్ లాల్, గౌతమితో పాటు విశ్వాంత్, రైనా రావ్, అనీషా, నాజర్, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎల్.బి.శ్రీరాం, అయ్యప్పశర్మ, వెన్నెలకిషోర్, బ్రహ్మాజీ, నవీన్ నేని, ధన్ రాజ్, ప్రవీణ్, తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మహేశ్ శంకర్ అందిస్తుండగా, జీవీ చంద్రశేఖర్ ఎడిటర్ గా వున్నారు.

English summary

Manamantha movie is releasing on August 5th