'మనమంతా' అంటున్న మోహన్ లాల్

Manamantha movie teaser

12:51 PM ON 25th June, 2016 By Mirchi Vilas

Manamantha movie teaser

మోహన్ లాల్-గౌతమి జంటగా టాలీవుడ్ లో రానున్న ఫిలిం 'మనమంతా'. రకరకాల పోస్టర్స్ తో ఆకట్టకున్న ఈ చిత్రం టీజర్ రిలీజైంది. గతంలో ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం వంటి డిఫరెంట్ చిత్రాలను చేసిన చంద్రశేఖర్ యేలేటి దీనికి దర్శకత్వం వహించారు. దాదాపు నిమిషంపైనే ఉన్న ఈ వీడియోలో ఫ్యామిలీ, యూత్ వంటి అంశాలు అధికంగా వున్నాయి. ఇక ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టకుకుంటోంది మోహన్ లాల్ చెప్పిన డైలాగ్.. 'బ్రతకడం నేర్చుకున్నాననుకున్నా... కానీ, మనిషిలా బ్రతకడం మరిచిపోయా' అనేది బాగుంది ఇక మోహన్ లాల్ సొంతంగా వాయిస్ ఇవ్వడం మరో పాయింట్.

అంతా ఓకే అయితే జూలైలో తెలుగు, మలయాళంలో రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన. మరోవైపు ఆల్ ఆఫ్ అజ్ మూవీకి ఇది కాపీయేనన్నది మరోవైపు బలంగా వినిపిస్తోంది.

English summary

Manamantha movie teaser