ఆస్కార్ విజేత తో మంచు లక్ష్మి హాలీవుడ్ సినిమా

Manchu Lakshmi In Hollywood Movie

05:31 PM ON 9th May, 2016 By Mirchi Vilas

Manchu Lakshmi In Hollywood Movie

కలక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసురాలిగా తెలుగు చలన చిత్ర సీమలో అడుగుపెట్టిన మంచు లక్ష్మి ఒక నటిగానే కాక నిర్మాతగా, వ్యాఖ్యాతగా పలు విభాగాలలో తండ్రికి తగ్గ కూతురి గా తనదైన శైలిలో దూసుకుపోతోంది .టాలీవుడ్ కంటే ముందే పలు హాలీవుడ్ సినిమాలలో నటించి భారత్‌కు తిరిగి వచ్చిన ఈ భామ చాలా కాలం గ్యాప్ తరువాత మరోసారి హాలీవుడ్ సినిమాలో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి:మూడు గంటలు పాటు ముద్దు పెట్టించుకున్న కాజల్

మంచు లక్ష్మి ఇది వరకు అమెరికాలోని లాస్ వెగాస్, ఈఆర్, డెస్పరేట్ హౌస్ వైఫ్ వంటి టీవీ సీరియల్స్ లతో పాటు కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో కుడా నటించింది . చాలా కాలం తరువాత మంచు లక్ష్మి మళ్ళి తాజాగా "బాస్మతి బ్లూస్" అనే ఒక హాలీవుడ్ చిత్రంలో నటించింది . ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్‌తో పాటు , ఆమె పాత్రకు డబ్బింగ్‌ను కూడా పూర్తిచేసింది లక్ష్మి. ఈ సినిమాను ఆస్కార్ విజేత బ్రీ లారెన్స్, డోనాల్డ్ సతర్లాండ్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఎక్కువ భాగం భారత్‌లోనే షూటింగ్ జరుపుకోవటం విశేషం.

ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే , ఈ సినిమా ఓ సైంటిస్ట్ కథ. తాను సృష్టించిన ఓ వరి వంగడాన్ని మార్కెట్ చేసుకోవడానికి ఇండియాకు వచ్చిన సైంటిస్ట్ ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే ఒక డిఫరెంట్ కాన్పెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న బాస్మతి బ్లూస్ సినిమాను త్వరలోనే విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:అమ్మో ఈ అమ్మడు 'బ్రహ్మోత్సవం' స్టోరీ చెప్పెసిందే!

ఇవి కూడా చదవండి:తన తల్లి గురించి సీక్రెట్స్ బయటపెట్టిన చైతూ..

English summary

Mohan Babu's daughter got Special fame in Telugu Film Industry and Now she acted in a Hollywood Movie Named "Basmati Blues". This movie was going to release soon and previously also she acted in few of the Hollywood Serial and Movies.