'శివగామి'గా ముందు ఈమెను అడిగారట.. కానీ ఈమె మాత్రం..

Manchu Lakshmi rejected to act in Sivagami role in Baahubali

11:11 AM ON 26th October, 2016 By Mirchi Vilas

Manchu Lakshmi rejected to act in Sivagami role in Baahubali

'అనగనగా ఒక ధీరుడు' సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది మంచు వారమ్మాయి లక్ష్మి. 'చందమామ కథలు' సినిమాతో మోడ్రన్ లుక్ తో మెప్పించింది. అయితే మంచు లక్ష్మికి అప్పట్లో ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. ఆ క్యారెక్టర్ చేసుంటే లక్ష్మి ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉండేదోనని సినీజనం అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ జక్కన్న తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన ఘనకీర్తి రాజమౌళికే దక్కుతుంది. ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన 'శివగామి' పాత్ర ఆమెకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది.

అయితే 'శివగామి' పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పాత్ర చేయడానికి రమ్యకృష్ణను సంప్రదించడానికి ముందు మంచు లక్ష్మిని చేయమని రాజమౌళి అడిగారట. అయితే ప్రభాస్ కు తల్లిగా చేస్తే దాని కంటే ఫన్నీ విషయం మరొకటి ఉండదని మంచు లక్ష్మి తిరస్కరించింది.. ఈ విషయాన్ని ఆమె స్వయంగా అలీతో సరదాగా ప్రోగ్రామ్ లో వెల్లడించింది. ప్రభాస్ కి తల్లిగా ఎలా? అలా ఊహించుకోవాలి కదా. కానీ అది నాకు సాధ్యం కాదు. అందుకే ఒప్పుకోలేదు అని వివరించింది. మంచు లక్ష్మి తర్వాత ఈ ఆఫర్ శ్రీదేవీ, టబును వరించింది. చివరికి రమ్యకృష్ణకు ఆ పాత్ర చేసే అవకాశం దక్కింది.

English summary

Manchu Lakshmi rejected to act in Sivagami role in Baahubali