ఇక జడ్జి అవతారంలో మంచులక్ష్మి

Manchu Lakshmi To Act As Judge In Her Next Movie

01:26 PM ON 13th May, 2016 By Mirchi Vilas

Manchu Lakshmi To Act As Judge In Her Next Movie

బుల్లితెరపైనే కాదు..వెండితెరపై తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటి మంచులక్ష్మి ట్రెండ్‌కు తగ్గట్టుగా మారిపోతోంది. బుల్లితెర మీద పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, యాంకరింగ్ లో , జడ్జి రోల్ లో అదరగొట్టేస్తోంది. ఇక తాజాగా ఓ మూవీలో ఏకంగా జడ్జి రోల్‌లో కనిపించబోతోంది. కార్తికేయ గోపాలకృష్ణ డైరెక్షన్‌లో రానున్న ఈ థ్రిల్లర్ మూవీకి ఈనెల 20న పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్తికేయ గతంలో నవదీప్‌తో ‘వసూల్ రాజా’, జగపతిబాబుతో ‘సాధ్యం’ మూవీని చేసిన విషయం తెల్సిందే! ఇప్పుడు కొత్త సినిమా జూన్ నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు. సింగిల్ షెడ్యూల్‌లో దీన్ని ఫినిష్ చేయాలన్నది మేకర్స్ ఆలోచనగా వుంది. త్వరలో నటీనటులను డైరెక్టర్ వెల్లడించనున్నాడు.

ఇవి కూడా చదవండి:అందరి ముందు హీరోయిన్ బట్టలు విప్పించిన డైరెక్టర్

ఇవి కూడా చదవండి:రూమ్ కి అమ్మాయిలని పంపిస్తే బ్యాంకు లోన్ ఇచ్చేస్తాడట

ఇవి కూడా చదవండి:అఖిల్ తో సినిమా తీయలేను అంటూ తప్పుకున్న డైరెక్టర్

English summary

Manchu Mohan Babu Daughter Manchu Lakshmi was presently signed a movie with Director Karthikeya Gopala Krishna and She was going to asct in Judge role in that movie.