ఎన్టీఆర్‌ చెయ్యి కాల్చేశాను

Manchu Manoj Burned NTR Hand

11:50 AM ON 17th February, 2016 By Mirchi Vilas

Manchu Manoj Burned NTR Hand

వేలూర్‌ ఇన్‌స్టిట్యూబ్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాలేజీ కి ముఖ్య అతిధిగా వెళ్ళిన మంచు మనోజ్‌ అక్కడ విద్యార్ధులతో ముచ్చటిస్తూ తన చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నాడు. తన చిన్న తనంలో ఎన్టీఆర్‌తో ఎక్కువ సన్నిహితంగా ఉండే వాడట. చిన్నప్పుడు ఎన్టీఆర్‌ని బాగా ఏడిపించేవాడిని. నేను బాగా అల్లరి చేసే వాడ్ని కానీ ఎన్టీఆర్‌ మాత్రం చాలా సైలెంట్‌గా ఉండేవాడు. ఒకసారి ఎన్టీఆర్‌ వాళ్ళ అమ్మగారితో కలిసి మా ఇంటికొస్తే ఒక బుడగని చూపించి దాని మీద ఏవో ప్రయోగాలు చేస్తున్నానని ఎన్టీఆర్‌ నమ్మించాను. అంతేకాదు ఆ బుడగని క్యాండిల్‌తో కాల్చినప్పుడు ఎన్టీఆర్‌ చెయ్యి కాలిపోయింది. ఇప్పటికీ ఆ కాలిన మచ్చ ఎన్టీఆర్‌ చెతిపైనే ఉంటుందని మనోజ్‌ వివరించాడు. నాకు ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితులు ఎన్టీఆర్‌, సునీల్‌ అని చెప్పాడు. ఒకవేళ మల్టీస్టారర్‌ చిత్రం చెయ్యాల్సివస్తే మొదట ఎన్టీఆర్‌ తో చెయ్యడానికే ఇష్ట పడతాను. ఆ తరువాత సునీల్‌తో చేస్తాను అని మనోజ్‌ అన్నాడు.

English summary

Mohan Babu second son Hero Manchu Manoj says that Junior NTR was his closest childhood friend and they two used to play yogether in childhood days.In one occasion he says that he burned NTR hand with candle and made a mark there