మనోజ్ కి నచ్చిన మెచ్చిన వంటిల్లు ఎక్కడుంది?

Manchu Manoj Favourite Restaurant In Visakhapatnam

11:22 AM ON 28th July, 2016 By Mirchi Vilas

Manchu Manoj Favourite Restaurant  In Visakhapatnam

సినిమా వాళ్ళంటేనే వాళ్ళ రేంజ్ మనకి అందదు. ముఖ్యంగా సినిమాహీరోలకు - హీరోయిన్స్ కు నచ్చే విషయాలు ఆషామాషీగా వుండవు. పైగా విదేశాల్లో వున్నవాటిపైనే మోజు ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, అందరికీ అందుబాటులో లేని వాటినే, చాలా ఇష్టమైన విషయాలు అవుతాయి అంటుంటారు. ఇందులో మంచు మనోజ్ డి డిఫరెంట్ స్టైల్. సినిమా హీరోల్లో చాలా బోళామనిషి మంచివాడు అందరినీ కలుపుకుపోయేవాడు అని ముద్ర పడిన ఉన్నంతలో మంచి ఫిజిక్ నే మెయింటైన్ చేస్తూ ఈ మధ్యకాలంలో కాస్త బొద్దుగా తయారైన మనోజ్ మాంచి భోజన ప్రియుడు. దీంతో నోరుకట్టేసుకోవడం డైటింగ్ పేరుతో నచ్చేభోజనానికి దూరంగా ఉండటం ఇతని వల్ల కానేకాదు. అందుకే పుష్టిగానే భోంచేస్తాడు. అయితే, మనోజ్ తాజాగా ఒక విషయం ట్వీట్ చేసి, అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

ఇంతకూ..షూటింగుల నిమిత్తం వివిద దేశాలు రకరకాల ప్రాంతాలు తిరిగే ఈ హీరోకు బాగా నచ్చిన రెస్టారెంట్ ఏమిటో ఎక్కడుందో తెలుసా? మలేషియా - చైనా - సింగపూర్ - అమెరికా - స్విట్జర్లాండ్... ఆగండాగండి... మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అది కూడా వైజాగ్ లో నండీ బాబూ! అవును ప్రసుతం వైజాగ్ లో షూటింగ్ లో బిజీగా ఉన్న మనోజ్ తన ఫేవరెట్ హోటల్ కి వెళ్లి టిఫిన్ చేశాడు. ఆ విషయాన్ని తనకు అంత రుచికరమైన వంటలను అందించిన వ్యక్తిని అభిమానులకు పరిచయం చేశాడు. వైజాగ్ లోని వెంకటాద్రి వంటిల్లు అంటే మనోజ్ కి చాలా ఇష్టమట. ఆ హోటల్ లో దొరికే టిఫిన్ తనకు చాలా ఇష్టమని ట్వీట్ చేశాడు.

ఇది కూడా చూడండి: తిరుమల శ్రీవారికి వేలకోట్లు కుమ్మరించిన ఒకేఒక్కడు... ఎవరో తెలుసా?

ఇది కూడా చూడండి: భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటే.. ఈ 9 సూత్రాలు పాటించాల్సిందే!

ఇది కూడా చూడండి: రహస్యలోయ 'గండికోట' వెనుక దాగిన రహస్యాలివే!

English summary

Manchu Manoj Favourite Restaurant In Visakhapatnam.