ఫ్రెండ్ చెల్లెల్ని రేప్ చేసిన వాడికి బుధ్ధి చెప్పిన మనోజ్

Manchu Manoj is a real hero

04:32 PM ON 4th April, 2016 By Mirchi Vilas

Manchu Manoj is a real hero

తెలుగు చిత్రసీమలో కలెక్షన కింగ్ మోహన్ బాబు ది ఓ విలక్షణ వ్యక్తిత్వం... అవసరమైతే అక్కడున్నది ఎవరైనా సరే కడిగి పారేస్తాడు.... ఆ మధ్య తెలుగు సినిమా పండగలో మెగాస్టార్ కి కూడా కౌంటర్ ఇచ్చి వార్తలకెక్కాడు. ఇక కొడుకుల్లో మంచు మనోజ్ కూడా అదే బాట... ఫ్రెండ్స్, సరదాలు, అన్నీ వున్నా అమ్మాయిలకు అన్యాయం జిరిగినా, ఎవరైనా తేడా చేసినా వెంటనే స్పందించేస్తాడు. అవతల వైపు ఎంతటి పెద్దలైనా, ప్రముఖులైనా సరే లెక్క చెయ్యడు. గతంలో చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో సింగపూర్ నుంచి ఫ్రెండ్ చెల్లిల్ని సొంత ఫ్రెండ్స్ దారుణంగా హింసించి, కొట్టి, ఆ పై రేప్ చేసారట. హైదరాబాద్ లో ఉన్న మనోజ్ విషయం తెలుసుకుని చెన్నై వెళ్లి హోటల్ లో వీడియో పుటేజ్ పరిశీలించి సదరు వ్యక్తిని పట్టుకుని ఉతికి ఆరేసాడట.

విషయం తెలిసి ఆ ప్రముఖ వ్యక్తి తాలూకు పెద్దలు ఎంటర్ అయ్యారట. మీ నాన్నగారి దృష్టికి తీసుకెళతాం అని బెధిరించారట. నేను అయితే ఓ విధంగా పర్వాలేదు, ఇలాంటి విషయాలు నాన్న గారికి తెలిస్తే, అస్సలు వదిలిపెట్టరు, ఛంపేస్తారు' అని చెప్పేసరికి వాళ్ళు జారుకున్నారట. ఓ టివి ఇంటర్వ్యూలో మనోజ్ ఈ విషయాలు వెల్లడించాడు. అంటే నిజజీవితంలో హీరో అన్నమాట..


English summary

Manchu Manoj is a real hero. Manchu Manoj gave a life to one girl.