రామ్‌చరణ్‌ సినిమాలో 'మంచు' విలన్‌!!

Manchu Manoj is acting as a villan in RamCharan Tej's new movie

06:45 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

Manchu Manoj is acting as a villan in RamCharan Tej's new movie

రామ్‌చరణ్‌ కధానాయకుడిగా తెరకెక్కబోతున్న తాజా చిత్రం తమిళంలో సూపర్‌ హిట్ అయిన 'తనీ ఒరువన్‌' కు రీమేక్‌. ఈ చిత్రాన్ని సురేందర్‌ రెడ్డి తెరకెక్కించబోతున్నారు. అయితే ఇందులో విలన్‌గా అప్పుడు అందాల నటుడు అరవింద్‌స్వామిని ఎంపిక చేసుకున్నారన్న విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం అరవింద్‌ స్వామి ఎక్కువ మొత్తంలో పారితోషికం అడగటంతో అరవింద్‌ని తప్పించి మంచు మనోజ్‌ని తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారట. అప్పట్లో చిరు నటించిన సినిమాల్లో మోహన్‌బాబు విలన్‌గా నటించారు.

ఇప్పుడు చిరు తనయుడు హీరోగా నటిస్తుండగా మోహన్‌బాబు తనయుడు మనోజ్‌ విలన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ముందుగా విలన్ పాత్ర కోసం రానా, నాగార్జున, నారా రోహిత్‌ల పేర్లు వినిపించినా ఫైనల్‌గా మంచుమనోజ్‌ చేత ఆ రోల్ని చేయించాలని రామ్‌చరణ్‌ టీమ్‌ భావిస్తున్నారట. మంచు మనోజ్‌ తన తండ్రిలానే విలన్‌ క్యారక్టర్లు చేయాలని ఉందని ఇదివరకే చెప్పారు. ఇప్పుడు చరణ్‌ ఇచ్చిన ఆఫర్‌కు మనోజ్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలి.

English summary

Manchu Manoj is acting as a villan in RamCharan Tej's new movie. Surender Reddy is directing this movie. It is the remake of Thanu Oruvan.