చరణ్‌ తో చెయ్యనన్న మనోజ్‌!

Manchu Manoj is not acting in Ramcharan's movie

11:27 AM ON 8th December, 2015 By Mirchi Vilas

Manchu Manoj is not acting in Ramcharan's movie

బ్రూస్లీ తరువాత రామ్‌చరణ్‌ నటించబోతున్న తాజా చిత్రం తమిళంలో సూపర్‌ హిట్టైన 'తని ఒరువన్'కి రీమేక్‌. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ సరసన శృతిహాసన్‌ కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో విలన్‌గా అరవింద్‌ స్వామిని ఎంపిక చేశారని వార్తలొచ్చాయి. కానీ అరవింద్‌ స్వామి భారీగా పారితోషికం డిమాండ్‌ చెయ్యడంతో అరవింద్‌ స్వామిని పక్కకి పెట్టి మంచు మనోజ్‌ని ఎంపిక చేశారని వార్తలొచ్చాయి. అయితే తాజాగా వీటికి స్పందిస్తూ మంచు మనోజ్‌ గళం విప్పాడు. రామ్‌చరణ్‌ సినిమాలో నేను నటిస్తున్నాన్న వచ్చిన వార్తలన్నీ పుకార్లే, నేను ఈ చిత్రంలో నటించడం లేదు.

అయితే తమిళంలో తను ఓరువన్‌లో నటించిన అరవింద్ స్వామే తెలుగులో కూడా నటించబోతున్నారు. అందుకోసం అరవింద్‌ అడిగిన పారితోషకం ఇవ్వడానికి రామ్‌చరణ్‌ అండ్‌ టీమ్‌ కూడా అంగీకరించారని క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని అల్లుఅరవింద్‌, ఎన్‌.వి.ప్రసాద్‌లు కలిసి నిర్మిస్తున్నారు.

English summary

Manchu Manoj is not acting in Ramcharan's movie. This movie is tamil remake of Thanu Oruvan and this movie is directing in telugu is Surender Reddy.