బస్టాండ్ లో మూటలు మోసిన మనోజ్

Manchu Manoj turned as a porter for Memu Saitham event

01:22 PM ON 11th July, 2016 By Mirchi Vilas

Manchu Manoj turned as a porter for Memu Saitham event

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పోర్టర్ అవతారం ఎత్తాడు. హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లో మూటలు మోశాడు. మరి హీరో అంటున్నారు, కూలీగా పని చేయటమేమిటి, ఒకవేళ సినిమా షూటింగ్ అయి ఉంటుంది అని భావిస్తున్నారా? ఇక అసలు విషయానికి వస్తే తన సోదరి మంచు లక్ష్మీప్రసన్న నిర్వహిస్తున్న మేము సైతం కార్యక్రమం కోసం మంచు మనోజ్ కూలీగా మారాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ కుటుంబాన్ని ఆదుకోవటం కోసం బాధ్యతగా బరువులు మోశాడు. ఈ సందర్భంగా సంపాదించిన డబ్బులను మేము సైతం కార్యక్రమానికి విరాళంగా ఇచ్చాడు.

మరోవైపు మంచు మనోజ్ ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. అతడితో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడ్డారు. కాగా మేము సైతం కార్యక్రమం కోసం ఇప్పటికే పలువురు సినీ నటీనటులు కూరగాయలు అమ్మడం మొదలు పానీపూరి, కారు సర్వీసింగ్, బేకరీలో పని చేయడం వంటి విషయాలు తెలిసినవే.

1/4 Pages

English summary

Manchu Manoj turned as a porter for Memu Saitham event