మనోజ్‌ 'శౌర్య' ఫస్ట్‌లుక్‌

Manchu Manoj's

12:11 PM ON 21st November, 2015 By Mirchi Vilas

Manchu Manoj's

సంతోషం చిత్రంతో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని అందించిన దర్శకుడు దశరథ్‌. ఆ తరువాత లో ప్రభాస్‌ నటించిన మిస్టర్‌ పెర్‌ఫెక్ట్‌తో మన ముందుకొచ్చి సూపర్‌హిట్‌ కొట్టాడు. మళ్లీ నాగార్జునతో గ్రీకువీరుడు చిత్రం చేశాడు. అది ఫ్లాప్‌ అవ్వడంతో ఈసారి కంప్లీట్‌ లవ్‌స్టోరీతో మన ముందుకు వస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్‌, రెజీనా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శౌర్య అని టైటిల్‌ ఖరారు చేశారు. సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకం పై ఎం.శివకుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని మంచు మనోజ్‌ కొంతసేపటి క్రితం విడుదల చేశారు. ఇందులో మనోజ్‌ని ఎప్పుడూ చూడని విధంగా సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఒక సరికొత్త ప్రేమకథతో ఈ చిత్రాన్ని దశరథ్‌ తెరకెక్కిస్తున్నారు. మంచు మనోజ్‌ మ్యారేజ్‌ అయ్యాక నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఎప్పుడు ఫుల్‌ మాస్‌ చిత్రాలనే ఎంచుకునే మనోజ్‌ మ్యారేజ్‌ తరువాత తన స్టైల్‌ని మార్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. 'శౌర్య' చిత్రానికి గోపీ మోహన్‌ కథ అందించారు. ఇందులో ఒక కీలకమైన పాత్రలో ప్రకాష్‌రాజ్‌ నటిస్తున్నారు.


English summary

Hero Manchu Manoj's New Movie Showrya First Look Released,Dierector Dasaradh Directed This Film Says Its a Complete Family Entertainer.Regina Acted As A Heroine