'మంచు విష్ణు'తో రొమాన్స్‌ చేస్తున్న యంగ్‌ బ్యూటీ !

Manchu Vishnu romancing with young beauty

11:59 AM ON 11th December, 2015 By Mirchi Vilas

Manchu Vishnu romancing with young beauty

నాగశౌర్య నటించిన 'జాదుగాడు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన యంగ్‌ బ్యూటీ సోనారిక బదోరియా. ఈ చిత్రం ఫ్లాప్‌ అయినా తన అందంతోనూ, నటనతోనూ ఆకట్టుకోవడంతో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న 'సరదా' చిత్రంలో హీరోయిన్గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంతో పాటు మరో రెండు సినిమాలు బెల్లంకొండ శ్రీనివాస్‌, సందీప్‌ కిషన్‌ తో చేస్తూ బిజీ బిజీగా ఉంది. సరదా చిత్రం షూటింగ్‌ ఇంకా పూర్తవ్వకుండానే మరోసారి మంచు విష్ణుతో నటించే అవకాశాన్ని అందుకుంది ఈ బ్యూటీ. మంచు విష్ణు, రాజ్‌ తరుణ్‌ లతో జి.నాగేశ్వర రెడ్డి ఒక మల్టీస్టారర్‌ ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే.

అందుకోసం మంచు విష్ణు సరసన బాలీవుడ్‌ బ్యూటీ అమైరా దస్తూర్‌ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం అమైరా ఇతర చిత్రాలతో బిజీగా ఉండటం వలన ఈ సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకుంది. అందువల్ల అమైరా స్ధానంలో సోనారికాను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

English summary

Manchu Vishnu romancing with young beauty Sonarika Bhadoria.