మోహన్ బాబు పొలిటికల్ ఎంట్రీ పై విష్ణు షాకింగ్ కామెంట్స్

Manchu Vishnu Shocking Comments On Mohan Babu Political Entry

05:46 PM ON 27th April, 2016 By Mirchi Vilas

Manchu Vishnu Shocking Comments On Mohan Babu Political Entry

ఇటీవల మోహన్ బాబు తాను ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలనుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే . తాజాగా మోహన్ బాబు పొలిటిక‌ల్ రీ ఎంట్రీపై ఆయన కుమారుడు మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్ చేశాడు. మోహన్ బాబు పొలిటికల్ ఎంట్రీ పై విష్ణు స్పందిస్తూ త‌న తండ్రి మళ్ళి రాజకీయాల్లోకి రావడం తనకు ఇష్టం లేదని మంచు విష్ణు అన్నాడు. తానూ చేసే ప్రతి సినిమాకు సంబంధించిన కథను మోహన్ బాబు వింటారని, ఆయన నిర్ణయం చాలా కరెక్టుగా ఉంటుందని చెప్పాడు.

ఇటీవల మంచు విష్ణు , యంగ్ హీరో రాజ్‌త‌రుణ్‌తో కాంబినేషన్ లో వచ్చిన ఈడో ర‌కం ఆడో ర‌కం సినిమా సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుని మంచి వ‌సూళ్ల‌తో ర‌న్ అవుతున్న విషయం తెలిసిందే. మంచు విష్ణు మాట్లాడుతూ ఒక సినిమా ఫ్లాప్ అయితే దానికి బాధ్యుడు దర్శకుడేనని , తాము కేవలం దర్శకుడి చేతిలో కీలుబొమ్మలం మాత్రమేనని అన్నాడు. యాక్షన్, కామెడీ సినిమాలంటే తనకు ఇష్టమని తెలిపిన ఈ మంచు వారి అబ్బాయి తనకు "రామాయణం" డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ధియేటర్ల పై కొందరు ఆధిపత్యం చెలాయిస్తున్నారని అన్నాడు . తనకు ఇద్దరు కూతుళ్లు పుట్టిన తర్వాత తనకు మహిళల పై మరింత గౌరవం పెరిగిందని మంచు విష్ణు అన్నాడు.

ఇవి కూడా చదవండి:మొదలైన పవన్ కొత్త సినిమా

ఇవి కూడా చదవండి:ఆ ఊరిలో 80 శాతం వ్యభిచారులేనట!

ఇవి కూడా చదవండి:పిరియడ్స్ టైం అని చెప్పినా వదలడం లేదు

English summary

Recently Manchu Mohan Babu made a statement that he was going to re enter into politics . Mohan Babu Son Manchu Vishnu said that he don't want his father to enter into politics. He said that his father will listen each and every script of his film and he thought his judgement was true.