విష్ణు హీరోగా 'అసెంబ్లీ రౌడీ' రీమేక్

Manchu Vishnu To Remake Assembly Rowdy Movie

11:58 AM ON 4th June, 2016 By Mirchi Vilas

Manchu Vishnu To Remake Assembly Rowdy Movie

అప్పట్లో ఓ సంచలన చిత్రంగా నిలిచిన అసెంబ్లీ రౌడీ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారా? అంటే అవునని స్వయంగా ఈ చిత్రంలో హీరోగా వేసిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రకటించారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఆ చిత్రం విడుదలై శనివారంతో పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా శుక్రవారం దర్శకుడు బి. గోపాల్ , రచయిత పరుచూరి గోపాలకృష్ణతో కలిసి మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ రౌడీ ని 41 రోజుల్లో తీశాం. 25 వారాలు ఆడింది. తిరుపతి దగ్గర తిరుచానూర్ లో క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఓ ఐదుగురు కాంగ్రెస్ వాళ్లు వచ్చి గొడవ చేసి, మాకు భద్రతగా ఉన్న ఓ కానిస్టేబుల్ ను కొట్టబోతే, చేతిలో ఉన్న కత్తితో తరిమా. వాళ్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ లో అప్పగించాం. సినిమా రిలీజయ్యాక అసెంబ్లీ రౌడీ అనే టైటిల్ పెట్టానని అసెంబ్లీలో మూడు రోజుల పాటు గొడవ చేసారు. సినిమా నిషేధించాలన్నారు. నా కటౌట్లు ధ్వంసం చేశారు. తీరా స్పీకర్ గారు ఈ సినిమా చూసి అబ్జెక్ట్ చెయ్యాల్సింది ఏమీ లేదన్నారు' అని ఆనాటి ఘటనలను మోహన్ బాబు వివరించారు. ఇప్పుడు అసెంబ్లీ రౌడీ రీమేక్ ని చెయ్యాలని విష్ణు ఆశిస్తున్నాడు అని చెప్పారు.

ఇది తమిళంలో పి. వాసు డైరెక్ట్ చేయగా హిట్టయిన వేలై కిడైచుడుచ్చు సినిమాకి రీమేక్ . అప్పుడు గుర్రంలా పరుగులు పెడుతున్న బి. గోపాల్ ను డైరెక్ట్ చెయ్యమంటే సరేనన్నాడు. రెండు రోజుల్లో పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాసేశారు. హీరోయిన్ గా దివ్యభారతిని ఎంపిక చేశాం. అద్భుతంగా చేసింది. నా తండ్రి పాత్రకు మొదట రావు గోపాలరావును అనుకున్నాం. ఆయన షూటింగ్ కు ఏడింటికి కాకుండా తొమ్మిదిన్నరకు వస్తానంటే, సున్నితంగా వద్దని చెప్పి జగ్గయ్యగార్ని తీసుకున్నాం.. స్వర్గం నరకం లో నా హీరోయిన్ గా చేసిన అన్నపూర్ణ ఇందులో నా తల్లి పాత్రను చేశారు. కె.వి. మహదేవన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.

సెట్స్ పై మోహన్ బాబు నటిస్తుంటే, తాను డైరెక్టర్ లా కాకుండా ఓ ప్రేక్షకుడిలా అలాగే చూస్తుండిపోయేవాణ్ణని చెప్పారు బి. గోపాల్. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ మా జీవితంలో ఒక్క అక్షరం కూడా మార్చకుండా తీసిన ఏకైక సినిమా అసెంబ్లీ రౌడీ . డైలాగ్ చెప్పగలిగినవాడికి, డైలాగ్ రాయగలిగినవాడు దొరికితే, దాన్ని దమ్మెంతుంటుందో చూపించిన మొదటి సినిమా అసెంబ్లీ రౌడీ. అలా డైలాగ్స్ తో ఆడుకున్నాడు మోహన్ బాబు అని తెలిపారు.

ఇవి కూడా చదవండి: ప్రభుదేవా డాన్స్ అదుర్స్ : అభినేత్రి టీజర్

ఇవి కూడా చదవండి:అనుష్కకు ముద్దిచ్చి సెండాఫ్ చెప్పిన కోహ్లీ

English summary

On behalf of 25 years for Assembly rowdy movie Mohan Babu and that film director B.Gopal talked with media and said that they were going to remake "Assembly Rowdy" movie with Manchu Vishnu.