70 ఏళ్ళ వయస్సులో ఈ బామ్మ చేసే పని చూస్తే షాకౌతాం!

Manda Yellamma 70 years old woman doing shocking job

12:06 PM ON 4th November, 2016 By Mirchi Vilas

Manda Yellamma 70 years old woman doing shocking job

కొందరు ఊపిరి ఉన్నంత వరకూ అలా కష్టపడుతూనే వుంటారు. కొందరు హాయిగా కాలం వెళ్లదీస్తారు. ఇక ఆమె వయస్సు 70 ఏళ్లు సాధారణంగా ఈ వయస్సు వాళ్ళు, ఇంట్లో ఓ మూలన కూర్చొని, టైమ్ కు బిపి, షుగర్ టాబ్లెట్స్ వేసుకుంటూ, హరీ, రామా అంటూ దేవుడి నామస్మరణ చేసుకుంటూ కాలం గడిపేస్తారు.. కానీ గుంటూరుకు చెందిన యల్ల మందమ్మ అందరిలా కాదు 70 ఏళ్ల వయస్సులో... తెల్లవారగానే లేచి, అన్నం వండుకొని, ఇంత తిని, ఇంత సద్ది కట్టుకొని సైకిలెక్కి ఓ నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అక్కడున్న గడ్డికోసి, మోపు కట్టుకొని, సైకిల్ మీద వేసుకొని, మళ్లీ 4 కిలోమీటర్లు వచ్చి, ఊర్లో తిరిగి, ఆ గడ్డిమోపును 100 రూపాయలకు అమ్ముతూ జీవనం సాగిస్తోంది.

1/4 Pages

కూర్చొని చేసే పనుల్లోనే 56-60 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుంటున్న ఈ రోజుల్లో 70 ఏళ్ల వయసులో కూడా ఇంకా కష్టింతేతత్త్వం మారని ఆ మట్టిమనిషికి నిజంగా శతకోటి వందనాలు. యల్ల మందమ్మ ప్రతి రోజు ప్రయాణించే నాలుగు కిలోమీటర్లలో దాదాపు రెండు కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం సరిగ్గా ఉండదు. ఆ రెండు కిలోమీటర్లు.. రైల్వే ట్రాక్ మీద నడవాల్సిందే.

English summary

Manda Yellamma 70 years old woman doing shocking job