వాగ్గేయకారులు డాక్టర్ బాలమురళి ఇక లేరు!

Mangalampalli Balamuralikrishna was expired

10:50 AM ON 23rd November, 2016 By Mirchi Vilas

Mangalampalli Balamuralikrishna was expired

ప్రముఖ సంగీత విద్వాంసుడు, వాగ్గేయ కారుడు పద్మవిభూషణ్ డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ మంగళవారం చెన్నైలోని తన స్వగృహంలో తన 86వ ఏట తుది శ్వాస విడిచారు. బుధవారం అంత్యక్రియలు జరుగుతాయి. ఆయన గత కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈయన మరణం పట్ల పలువురు ప్రముఖులు, సంగీత ప్రియులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తమిళ నాట రాజకీయ ప్రముఖులు, సినీ సంగీత పెద్దలు వచ్చి ఆయన భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. తూర్పు గోదావరి జిల్లా శంకరగుప్తం గ్రామంలో 1930 జులై 6న జన్మించిన ఈయన గానంతో పాటు, వయోలిన్, మృందంగం, తదితర వాయిద్యాలలో నిష్ణాతులు.

1/10 Pages

కర్ణాటక సంగీతంలో సమున్నత స్థానాన్ని అధిరోహించిన డాక్టర్ బాలమురళీకృష్ణ హిందుస్థానీ సంగీతం, పాశ్యాత్య సంగీతాల్లోనూ గొప్ప నైపుణ్యం సంపాదించారు. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు శిష్యులైన బాలమురళి తల్లి సూర్యకాంతమ్మ వీణ కళాకారిణి కాగా, తండ్రి పట్టాభిరామయ్య వేణువు, వయొలిన్, వీణ వాయిద్యాల్లో విద్వాంసులు.

English summary

Mangalampalli Balamuralikrishna was expired