మామిడి చెట్టు కొమ్మ నరికేశారు... అయినా కాయలు కాసాయి

Mangoes for cuts branch

11:01 AM ON 9th July, 2016 By Mirchi Vilas

Mangoes for cuts branch

ఈలోకంలో అనేక వింతలూ, విశేషాలు జరగడం సహజం. ఇందులో భాగంగా నరికిన కొమ్మ నుంచి అధికంగా మామిడికాయలు కాస్తున్నాయి. ఇది ఆ గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎక్కడంటే, వేలూరు జిల్లా వాణియంబాడి సమీపంలో నరికిన మామిడి కొమ్మ నుంచి 25కి పైగా కాయలు కాయడం స్థానికులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. వాణియంబాడి ఆలంకాయం కలరపట్టి ప్రాంతానికి చెందిన మాజీ ప్రధానోపాధ్యాయుడు పడవేట్టానకు చెందిన మామిడి తోటలోని ఓ వృక్షం కొమ్మను ఇటీవల నరికారు. నరికిన కొమ్మకు 25కు పైగా కాయలు కాశాయి. సాధారణంగా కొమ్మలకు గరిష్టంగా ఐదు మామిడికాయలు కాస్తాయి. అలాంటిది.. ఈ కొమ్మకి 25కు పైగా కాయలు కాయడంతో ఇదో వింత అని చెప్పుకుంటున్నారు.

English summary

Mangoes for cuts branch