పెడిక్యూర్‌ మరియు మానిక్యూర్‌ చేసుకోండిలా

Manicure and Pedicure

06:52 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Manicure and Pedicure

అందరూ అందంగా ఉండాలనే అనుకుంటారు. అందంగా ఉండడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కాని అందం అంటే ముఖానికి మాత్రమే సంబంధించిన విషయం కానేకాదు. ముఖం మాత్రం అందంగా ఉండి మీ చేతులు, కాళ్ళు చూడడానికి బాగోకపోతే ఎలా ఉంటుంది చెప్పండి… అందుకే కొంత మంది పార్లర్స్‌లో చాలా సమయం గడుపుతూ ఉంటారు. కాళ్ళు, చేతులను ప్రేమించేవారు చాలా డబ్బు ఖర్చుపెట్టి చికిత్సలు చేయించుకుంటూ ఉంటారు. చేతులకు మానిక్యూర్‌, కాళ్ళకు పెడిక్యూర్‌ని చేసుకోవడంవలన రక్తప్రసరణ బాగా జరిగి చేతులు, పాదాలు అందంగా తయారవుతాయి. వీటిని చేయించుకోవడానికి పార్లర్స్‌ చుట్టూ తిరడనవసరం లేదు. ఇంట్లోనే ఉంటూ ఈ చికిత్సలు చేసుకోవచ్చు. పద్దతులు, దశలు దాదాపు మానిక్యూర్‌కి, పెడిక్యూర్‌కి ఒకలాగే ఉంటాయి. వీటిని చేసి చూసాక వచ్చే తేడాని మీరే గమనిస్తారు.

కావలసినవి:

1. ఒక ప్లాస్టిక్‌ టబ్ లేదా బేసిన్‌

2. బేబీ షాంపు

3. రాతి ఉప్పు/ సముద్రం ఉప్పు - 1 టేబుల్‌ స్పూన్‌

4. నిమ్మకాయ -1

5. గులాభి రేకులు (అవసరమైతే) - కొన్ని

6. డెటాల్‌/మాంటి బాక్టీరియల్‌ లిక్విడ్‌ సోప్‌ -2 లేదా 3 చుక్కలు.

7. నెయిల్‌ పాలిష్‌ రిమూవల్‌

8. దూది

9. నెయిల్‌ కట్టర్‌/క్లిప్టర్స్‌

10. గోర్లు షేప్‌ చేసుకునేది.

11. నెయిల్‌ బ్రష్‌

12. ఆరెంజ్‌ స్టిక్‌

13. మాయిక్చరైజర్‌ క్రీమ్‌

14. బేస్‌కోట్‌

15. నెయిల్‌ పాలిష్‌.

పెడిక్యూర్‌ మరియు మానిక్యూర్‌ చేసుకునే పద్ధతి:

 • ముందుగా చేతులు/పాదాలు శుభ్రంగా సబ్బుతో కడగాలి. అలాగే గోర్లుకు ఉన్న నెయిల్‌ పాలిష్‌ని నెయిల్‌ రిమూవర్‌ తో దూదిని ఉపయోగించే తీసేయాలి.
 • ఒక బేసిన్‌ లో వేడినీళ్ళు తీసుకోవాని అందులో కొన్ని చుక్కలు బేబీ షాంపుని, రాతి ఉప్పుని, నిమ్మరసాన్ని వేయాలి.
 • ఇప్పుడు ఆ మిశ్రమంలో చేతులు/పాదాలు 10 నుండి 15 నిమిషాలపాటు నానపెట్టాలి. అదే విదంగా చేతి వేళ్ళను నెయిల్‌ బ్రష్‌తో రుద్ధుతూ మురికిని తొలగించాలి.
 • పాదాలకు మార్కెట్‌లో దొరికే పెడిక్యూర్‌ చేసుకునే రాయితో పాదాలను శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వలన మృతకణాలు తొలగిపోతాయి. ముఖ్యముగా అరికాలి వెనుక బాగాన బాగా శుభ్రపరుచుకోవాలి. తరువాత పొడివస్త్రంతో చేతులు /పాదాలు తుడుచు కోవాలి.
 • తదుపరి గోర్లను నెయిల్‌ కట్టర్‌ వెనుక భాగంతో గోర్లను శుభ్రపరుచుకోవాలి.
 • చేతి గోర్లు:
 • చేతిగోర్లని ఎలాపడితే అలాకాకుండా చక్కటి ఆకృతి సంతరించుకునేలా కత్తిరించాలి.
 • కాలి గోర్లు: కాలి గోర్ల ను కూడా చక్కగా కత్తిరించుకోవాలి. నాని ఉండడం వలన చర్మం మృదువుగా ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా నెయిల్‌ కట్టర్‌ని ఉపయోగించి కత్తిరించాలి.
 • తరువాత చేతులకి/పాదాలకి క్యూటికల్‌ క్రీము ని రాసుకుని మసాజ్‌ చేయాలి. ఒకవేళ ఈ క్రీమ్‌ అందుబాటులో లేకపోతే ఆలివ్‌ ఆయిల్‌ ని వాడవచ్చు.
 • మసాజ్‌చేసిన తరువాత చేతులు/పాదాలను శుభ్రంగా కడిగి టర్కీటవల్‌ తో తుడుచుకోవాలి. అలాగే వేళ్ళమధ్య నీరు ఉండిపోతుంది. దాన్ని కూడా శుభ్రంగా తుడిచేయాలి.
 • పొడిగా మారిన పాదాలు/చేతులకు మాయిక్చరైజర్‌ క్రీమ్‌ని రాసుకోవాలి.
 • తరువాత దూదితో ఎక్కువయిన క్రీమ్‌ని లేదా లోషన్‌కి తుడిచుకోవాలి.
 • ఇప్పుడు మీకు నచ్చిన రంగుని ఎంచుకుని నెయిల్‌ పాలిష్‌ వేసుకోవాలి.
 • ముందుగా ఒక సారి వేసి ఆరనివ్వాలి. తరువాత మరల నెయిల్‌ పాలిష్‌ వేసుకోవాలి. ఇలా 2 సార్లు వేసుకోవడం వలన మీరు ఎంచుకున్న రంగు వస్తుంది. ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు నెయిల్‌ పాలిష్‌ రంగు గోర్లకు నిలిచి ఉంటుంది.
 • అదే విధంగా కాలికి నెయిల్‌ పాలిష్‌ వేసుకునేటప్పుడు, కాలి వేళ్ళను దూరం చేసి వేసుకోవాలి. దీనికి దూదిని వాడడం మంచిది. కాళ్ళవేళ్ళ మధ్యలో దూదిని ఉంచి అప్పుడు నెయిల్‌పాలిష్‌ వేసుకోవాలి. అందువల్ల ఒక వేలిరంగు ఇంకోవేలికి అంటుకోకుండా సహాయపడుతుంది.
 • చివరిగా గోరుకు కాకుండా పక్కన అంటుకున్న నెయిల్‌ పాలిష్‌ ని తుడిచేందుకు దూదిని నెయిల్‌ రిమూవర్‌ లో ముంచి తుడవాలి. ఇలా చేయడం వల్ల వేళ్ళు రంగు అందంగా కనిపిస్తుంది.

ఈ విధంగా నెలకి ఒకసారి చేసుకోవడం వలన పాదాలు/ చేతులు అందంగా ఉంటాయి. అదేవిధంగా రక్తప్రసరణకి తోడ్పడుతుంది. ఇంకా మృతకణాలను తొలగిస్తుంది. ఇంట్లో నే చేసుకునే సులభమైప పద్ధతి కనుక డబ్బు ఖర్చు లేకుండా అందాన్ని సొంతం చేసుకొవచ్చు.

English summary

Manicure and pedicure. Everyone loves to have beautiful hands and lovely legs. Pedicure and manicure helps to improve blood circulation