అమరావతి సదస్సులో మనీషా సంచలన వ్యాఖ్యలు

Manisha Koirala sensational comments in Amaravathi

06:24 PM ON 13th February, 2017 By Mirchi Vilas

Manisha Koirala sensational comments in Amaravathi

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగిన మహిళా పార్లమెంట్ సదస్సు కు హాజరైన ఒకప్పటి పాపులర్ హీరోయిన్ మనీషాకోయిరాల సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘వివక్ష-అసమానతలు’ అనే అంశంపై ప్రసంగించిన మనీషా మహిళలు ఎదుర్కొంటున్న వివక్షగురించి వివరించింది. అంతేకాదు ఇండస్ట్రీలో మహిళలపట్ల చూపిస్తున్న వివక్ష గురించి ఏకి పారేసింది. ఈ సందర్బంగా ఓ విషయాన్నీ గుర్తుచేస్తూ, బాలీవుడ్ లో నటీ నటులకు రెమ్యూనరేషన్ లో తేడాలపై ఒక నిర్మాతను అప్పట్లో ప్రశ్నించి తాను నానామాటలు పడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. నటించేందుకు తమకు, హీరోలకు ఇచ్చే పారితోషికంలో చాలా అంతరం ఉంటుందని చెప్పింది. మొదట తనకు తెలియదని, తెలిశాక దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొంది. వివక్ష ఒక్క బాలీవుడ్ కే పరిమితం కాదని, బయట మహిళలలు కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారని ఆమె వివరించేసరికి సదస్సులో చాలామంది మహిళలు ఆశ్చర్య పోయారు.

ఇది కూడా చూడండి: రాత్రివేళ ఇవి తిన్నారో ఇక అంతే సంగతులు

ఇది కూడా చూడండి: షాకింగ్ న్యూస్: గర్భిణీ మెదడులో మార్పులు!

English summary

Actress Manisha Koirala participated in Amaravathi women Parliament convention.