మంజిమ అదృష్టం అదరహో

Manjima Mohan to Act with Vijay Sethupathi

01:00 PM ON 9th May, 2016 By Mirchi Vilas

Manjima Mohan to Act with Vijay Sethupathi

తమిళంలో తొలి చిత్రమే గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో చేసే అవకాశాన్ని పొందింది కేరళకుట్టి మంజిమా మోహన్. శింబు హీరోగా ‘అచ్చం ఎన్బదు మడమియడా’ పేరుతో గౌతమ్‌ రూపొందిస్తున్న చిత్రంలో మంజిమా హీరోయిన్‌గా నటిస్తోంది. ద్విభాషా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘సాహసం శ్వాసగా సాగిపో’లో నాగచైతన్య హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలకు ముందే ఈ అమ్మడు మరో బంపర్‌ ఆఫర్‌ సొంతం చేసుకుందని కోలీవుడ్‌ టాక్‌. కెవి ఆనంద్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి హీరోగా నటించనున్న సినిమాలో హీరోయిన్‌గా మంజిమ ఎన్నికయిందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏజీఎస్‌ ఎంటర్‌టైనమెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టి.రాజేందర్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏమైనా మంజిమ అదృష్టం బాగుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:చిరంజీవి అందులో బెస్ట్ ... పైగా మంచోడు

ఇవి కూడా చదవండి:కారును ఓవర్ టేక్ చేసిన వ్యక్తిని చంపేసిన ఎమ్మెల్సీ కొడుకు

ఇవి కూడా చదవండి:17 ఏళ్లుగా మేడలో వున్న బులెట్ తొలగింపు

English summary

Malayalam Heroine Manjima Mohan was presently acting under the Direction of Gautam Menon in Sahasam Swasaga Sagipo with Naga Chaitanya. Now she grabs a chance to act with Vijay Sethupathi in afilm.