మావో లేఖ@రూ. ఆరున్నర కోట్లు

Mao Zedong Letter sells for £605,000

06:52 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Mao Zedong Letter sells for £605,000

చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక నాయకుడు మావో జెడాంగ్ రాసిన ఓ లేఖ రూ. ఆరున్నర కోట్ల రికార్డు ధర పలికింది. 1937లో బ్రిటన్ లేబర్ పార్టీ నాయకుడు క్లెమెంట్ అట్లీకి మావో రాసిన ఆరుదైన లేఖ వేలం పాటలో ఆరున్నర కోట్లకు అమ్ముడు పోయింది. చైనాకు చెందిన ఓ వ్యాపారే ఈ లేఖను కొనుగోలు చేసినట్టు వేలం సంస్థ సోత్‌బై వెల్లడించింది. అయితే ఆ వ్యాపారి పేరును మాత్రం వెల్లడించలేదు. చైనాపై దురాక్రమణకు వచ్చిన జపాన్ సైన్యాన్ని తిప్పికొట్టేందుకు కావాల్సిన సహాయం అందించాల్సిందిగా, ఈ దిశగా బ్రిటన్ సైన్యాన్ని ఒప్పించాల్సిందిగా ఆ లేఖలో మావో క్లెమెంట్‌ను కోరారు. అంతర్జాతీయ దౌత్యానికి సంబంధించి అప్పట్లో మావో రెండే రెండు లేఖలపై సంతకం చేశారు. అందులో ఇప్పుడు అమ్ముడు పోయిన లేఖ ఒకటి. ఈ లేఖకు తాము కోటిన్నర రూపాయలు వస్తాయని ఆశించామని, అయితే అనూహ్యంగా ఆరున్నర కోట్ల రూపాయలు రావడం విశేషమని నిర్వాహకులు వ్యాఖ్యానించారు.

English summary

Chinese Communist leader Mao Zedong letter was sold for £605,000 in Britain