40 అకౌంట్లలో మావోల  సొమ్ము చూస్తే దిమ్మతిరుగుద్ది 

Maoists Bank Accounts Freezed

11:28 AM ON 21st December, 2016 By Mirchi Vilas

Maoists Bank Accounts Freezed

రూ 500, రూ 1000 నోట్ల రద్దుతో మావోయిస్టులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మావోయిస్టులు నిర్వహిస్తున్న 40 అకౌంట్లను జార్ఖండ్‌లో బ్యాంకు అధికారులు ఫ్రీజ్ చేశారు. 40 ఖాతాల్లో 15 ఖాతాలు కరుడుగట్టిన నక్సల్స్‌వి కావడం విశేషం. వీరి తలలకు ప్రభుత్వం వెల ప్రకటించింది. మావోయిస్టులు ఇంత పెద్దమొత్తంలో ఖాతాలను ఇంత స్వేచ్ఛగా ఎలా నిర్వహిస్తున్నారన్న దానిపై విచారణ చేపట్టనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకు అధికారులు ఫ్రీజ్ చేసిన మావో ఖాతాలు రాంచి, జంషెడ్‌పూర్, చాయ్‌బసా, జిల్లాల్లో ఉన్నాయి. మావోయిస్టు అగ్రనేతలైన అకరమంజి, బ్రజేష్ గంజు, బిందు గంజు, రాకేశ్, శేఖర్ గంజు తదితరుల అకౌంట్లు ఫ్రీజ్ చేసిన వాటిలో ఉన్నాయి. కోహ్రం, అరిఫ్, కరమ్‌పాల్, కబిర్ తదితర మావోయిస్టులు ప్రభుత్వ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నారు. చాలామంది మావోలు తమ కుటుంబ సభ్యులు, బంధువుల ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు జమ చేశారు. ఇంతకీ ఈ ఖాతాల సీజ్ వలన రూ.55 కోట్లు నిలిచిపోవడంతో మావోయిస్టులు కష్టాలు ఎదుర్కొంటున్నారని అంటున్నారు.

ఇవి కూడా చదవండి: ఈ మహిళ తల తీసుకొస్తే, 7 కోట్లు ఇస్తారట

ఇవి కూడా చదవండి: కొత్త నోట్ల.. ప్రింటింగ్ ఖర్చెంతో తెలిస్తే షాకవుతారు

English summary

Most Wanted Maoists Accounts were freezed by the Bank officials and police officials in Jharkhand. The total value of that bank accounts was 55 crores.