ఒలంపిక్స్ లో చచ్చిపోయేదాన్ని .. అథ్లెట్ సంచలన వ్యాఖ్యలు

Marathon Runner Jaisha Says That She Could Have Died In Rio

12:52 PM ON 23rd August, 2016 By Mirchi Vilas

Marathon Runner Jaisha Says That She Could Have Died In Rio

రియోకు వెళ్లడం.. సెల్ఫీలు తీసుకోవడం.. ఉత్త చేతులతో తిరిగి రావడం.. ఓ ప్రముఖ రచయిత్రి ఓ వైపు విమర్శిస్తే, ఒలంపిక్స్ లో రోజులు గడుస్తున్నాయి. మన వాళ్లు ఓడిపోతూనే ఉన్నారు. భారత్ కు కనీసం ఒక పతకమైనా వస్తుందో? లేదో?.. ప్రజల అనుమానం మరోవైపు ఉంటే, అసలు మన క్రీడాకారులకు కనీసం మంచినీళ్లు దక్కలేదట. అవును అందుకే 'రియో ఒలింపిక్స్ లో దాహంతో చచ్చిపోయి ఉండేదాన్ని' అంటూ భారతీయ మహిళా అథ్లెట్ ఓపీ జైషా ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఆవేదన ఆమె మాటల్లోనే విందాం.

1/9 Pages

కనీసం మంచి నీళ్లు కూడా లేవు ...

ఆ రోజంతా చాలా ఎండగా ఉంది. ఉదయం 9 గంటలకు పోటీ. ఆ ఎండలోనే నేను పరుగు ప్రారంభించా. అక్కడ మా కోసం మంచినీళ్లు లేవు. శక్తి తెచ్చుకోవడానికి ఆహారం, ఎనర్జీ డ్రింక్స్ సైతం లేవు. ప్రతి 8 కి.మీ.లకు రియో నిర్వాహకులు ఏర్పాటు చేసిన చోటే నీరు దొరికింది. అది నాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. అన్ని దేశాలు వారి క్రీడాకారుల కోసం ప్రతి రెండు కిలోమీటర్లకు స్టాళ్లు ఏర్పాటు చేసి ఆహారం, డ్రింక్స్ అందించాయి. మన దేశం స్టాళ్లు మాత్రం ఖాళీగా కనిపించాయి’ అని ఓపీ జైషా చెప్పింది.

English summary

Indian Marathon Runner Jaisha said that she was struggled very much in Rio Olympics and she said that there was even no water in Indian Stalls in Rio Olympics. She said that she thought that she have been died there in Olympics.