భర్తతో కలిస్తే రేప్ గా లెక్క కడితే ఎలా?

Marital rape cannot be applied in India Says Maneka Gandhi

12:40 PM ON 12th March, 2016 By Mirchi Vilas

Marital rape cannot be applied in India Says Maneka Gandhi

ఎంతో ఉన్నతమైన భారతీయ సాంప్రదాయం కాల క్రమేణా కొత్తపుంతలు తొక్కి అది కాస్తా వెర్రి తలలు వేస్తోంది. ముఖ్యంగా వివాహ వ్యవస్థతో ఒకటైన జంట మధ్య చోటుచేసుకుంటున్న అపార్ధాలు చివరకు కేసు దాకా వెడుతూ నవ్వుల పాలు చేస్తున్నాయి. అన్యాయాలను అరికట్టేందుకే ఏర్పడిన చట్టం అగ్రహావేశాల ఆధారంగా ఎదుటివారిని ఇబ్బందిపెట్టడానికి ఆయుధంగా మారిపోతోంది. తాజాగా అత్యాచారం కేసుల విషయంలోనూ ఈ డిమాండ్ తెరమీదకు వచ్చింది.

పెళ్ళయిన జంటల్లో కూడా కొంత మంది భర్తలు భార్య ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా లైంగిక చర్యలకు పాల్పడటం జరుగుతుంటుంది. ఇలాంటి కేసుల్లో కొంతమంది తమ తమ భర్తలపై రేప్ కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వివిధ దేశాల్లో ఇలాంటి కేసులకు శిక్షలు కూడా విధించిన ఉదంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో చర్చ కూడా సాగుతోంది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టులో కేసు కూడా నమోదయింది.

ఇక, ఆడవారి పట్ల అరాచకంగా వ్యవహరించే రాక్షసులు ఉన్నారనేది నిజం. అదే సందర్భంలో భర్తను వేధించేందుకు "అత్యాచారం" కేసు పెట్టి, భర్తకు చుక్కలు చూపించే మహిళలూ ఉన్నారు. అందుకే ఈ అంశంపై సాక్షాత్తు రాజ్యసభలో చర్చ సాగింది మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ "వైవాహిక అత్యాచారం"పై ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో తనదైన శైలిలో స్పందిస్తూ ... లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. వివాహ సంబంధంతో ఒక్కటైన జంట మధ్య అత్యాచారం కేసు పెట్టే విధానం మన దేశానికి సరిపడదన్నారు. మత విశ్వాసాలు - వివాహ బంధం - సామాజిక ఆచారాలు - పెళ్ళి పై సమాజంలో ఉన్న అభిప్రాయం తదితర అంశాల కారణంగా భర్త అంటే భాగస్వామి అనే భావన ఉందని ఆమె పేర్కొన్నారు. భార్య పై భర్త లైంగిక చర్యను నేరంగా పరిగణించడం సరికాదని మంత్రి స్పష్టం చేశారు . అంతర్జాతీయంగా ఉన్న అవగాహన మన దేశంలో లేదన్నారు.

English summary

Women and Child Development minister Maneka Gandhi on Rajya Sabha said that Marital rape cannot be applied in India. She says that India is the country with some Values and India is the country that give more value to Relation Ship.