భార్యను బలవంత పెడితే ఇక రేప్ కేసులు

Marital Rape Will Be A Crime In India

05:26 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Marital Rape Will Be A Crime In India

అవును మీరు విన్నది నిజమే ఇండియాలో ఒక కొత్త చట్టం రాబోతోంది . భర్త తన భార్యను శృంగారం కోసం బలవంత పెడితే దాన్ని నేరంగా పరిగణించి , దాని పై విచారణ జరిపి భర్తలకు శిక్షలు విధించేల భారత్ లో కొన్ని కొత్త చట్టాలు రాబోతున్నాయి . ఈ చట్టాలను తెచ్చేందుకు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు కేంద్ర మహిళా , శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనక గాంధీ వెల్లడించారు . ఇటీవల భారత దేశ వ్యాప్తంగా 61 అదనపు జిల్లాలలో ప్రారంభించిన "భేటి బచావో , భేటి పడావో" కార్యక్రమంలో ప్రశంగించిన మేనక గాంధీ మాట్లాడుతూ వివాహ బంధమే అయినా , భర్త తన భార్యకు ఇష్టం లేకుండా బలవంతంగా తన లైంగిక వాంఛను తీర్చుకుంటే దాన్ని నేరంగా భావించేలా నిర్ణయం అతి త్వరలో వెలువడే అవకాశాలునాయని ఆమె తెలిపారు .

ఇవి కూడా చదవండి: 650 మందితో సెక్స్ చేసిన క్రికెటర్

ఇది ఇలా ఉంటే ఇదే అంశం పై మర్చి 10న రాజ్యసభలో ఒక రాజ్యసభ సభ్యుడు ప్రశ్నించగా స్పందించిన మేనక గాంధీ భారత చట్టాల్లో "వివాహ అత్యాచారం" అనేది లేదని , అటువంటివి చట్టాలు విదేశాలలో మాతమే ఉన్నాయని వాటిని భారత్ లో అమలు చెయ్యడం కష్టమని చెప్పుకోచారు. దీని పై భారత్ వ్యాప్తంగా మహిళా సంఘాలు మండిపడ్డాయి , తాజాగా వివాహ అత్యాచారం పై ఇప్పుడు మేనక గాంధీ ఇలా స్పందించారు.

ఇవి కూడా చదవండి:

ఫుల్ గా తాగి రోడ్ పై రచ్చ రచ్చ చేసిన అంజలి(వీడియో)

యాంకర్ ప్రశ్నకు షాక్ తిన్న బాలయ్య(వీడియో)

సుమ ను ఎంటర్ టైన్మెంట్ మంత్రిని చేస్తున్నారా?

English summary

Women and Child Development minister of India Menaka Gandhi said that if man forces his wife for sex then it will considered as crime. She said that government was going to take decision on this. Previously Menaka Gandhi opposed this Marital Rape issue when one of the Rajya Sabha Member asked about this issue.