జుకర్‌బర్గ్‌ పుట్టినరోజున అతిథి సందడి       

Mark Zucker Berg Celebrates His Birthday With His daughter

12:03 PM ON 16th May, 2016 By Mirchi Vilas

Mark Zucker Berg Celebrates His Birthday With His daughter

సోషల్ మీడియా రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్న ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ పుట్టినరోజు వేడుకలను ఆయన కంపెనీ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. కాలిఫోర్నియాలోని ఫేస్‌బుక్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు ఓ ప్రత్యేక అతిథి హాజరయ్యారు. ఆ అతిథి ఎవరంటే, ఆయన గారాలపట్టి మాక్స్‌. ఈ విషయాన్ని జుకర్‌బర్గ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలియజేస్తూ కుమార్తె మాక్స్‌ సమక్షంలో వేడుకలు చేసుకుంటున్న ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. గతేడాది నవంబర్‌లో జుకర్‌బర్గ్‌, ప్రిస్కిల్లా దంపతులకు మాక్స్‌ పుట్టింది. అప్పటి నుంచి తన కూతురిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు జుకర్‌బర్గ్‌. మాక్స్‌తో గడిపిన ప్రతి సంఘటనను, అనుభూతిని ఫొటోలు తీసుకుంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి:యూట్యూబ్‌లో సరికొత్త ఫీచర్‌ 'చాటింగ్'

ఇవి కూడా చదవండి:ఆ పనులు చేసే దానిలా కనిపిస్తున్నానా?

English summary

World's Number One Social Networking Site Facebook CEO Mark Zucker Berg Celebrates his 32nd birthday with his daughter at Facebook Head Quarters.