99 శాతం ఫేస్‌బుక్ షేర్లను దానం చేయనున్న జుకర్‌బర్గ్‌

Mark Zuckerberg Donates 99% Of Facebook Shares To Charity

02:44 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

Mark Zuckerberg Donates 99% Of Facebook Shares To Charity

ఫేస్బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ అతను తండ్రి అయినట్లు ప్రకటించాడు. తన యావదాస్తి లోని 99 శాతం ఆస్తిని ప్రపంచ మంచి కోసం దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు.

జుకర్‌బర్గ్‌ తమ కుమార్తెకు 'మాగ్జీమా' అనే పేరును కూడా పెట్టారు.

జుకర్‌బర్గ్‌ మరియు అతని భార్య ప్రిస్కిల్లా చాన్‌ కలిసి తమ ఫేస్బుక్‌ షేర్లలోని 99% వాటాను దానం చేయనున్నట్లు ఫేస్బుక్‌లో తెలిపారు. ఆ మొత్తం అంచనా విలువ 45 బిలియన్‌ డాలర్లు గా ఉంది . ప్రపంచం మంచి, ఆరోగ్యకరమైన ప్రపంచం కోసం దానం చెయ్యనున్నట్లు తెలిపారు.

జుకర్‌బర్గ్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మైక్రోసాప్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌, ఆయన భార్య మెలిండా కూడా అభినందించారు. ఈ రోజు జుకర్‌బర్గ్‌ అతని భార్య ప్రిస్కిల్లాలు తీసుకున్న నిర్ణయం ఎంతో స్ఫూర్తిదాయకమైనది అని అన్నారు.

తమ కుమార్తె పుట్టినందు చాలా ఆనందంగా ఉన్నామని భవిష్యత్తు పై నీవు మాకిచ్చిన నమ్మకాన్ని ఎలా వివరించాలో అర్ధం కావడం లేదని జుకర్‌బర్గ్‌ తన కుమార్తెకు రాసిన లేఖతో అన్నాడు. తమ కుమార్తె కొత్త జీవితం సంతోషాలతో, ఆరోగ్యవంతంగా వుంటుందని భావిస్తున్నామని అన్నాడు. ప్రపంచంలోని అందరు తల్లిదండ్రులాగే తాము కూడా తమ కుమార్తెకు మంచి జీవితాన్ని ఇవాలనుకుంటున్నాం అని అన్నాడు. ఈ నిర్ణయాన్ని ప్రపంచంలోని అందరు చిన్నారులను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న జూకర్‌బర్గ్‌ తన కుమార్తె మాగ్జిమాకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నాడు.

English summary

Facebook founder and ceo Mark Zuckerberg on Tuesday announced he had become a father.He said that he is going to donate 99% of facebook shares to charity