పసిపాపకు ఈత నేర్పుతున్న ఎఫ్ బి అధిపతి 

Mark Zuckerberg Teaches Swimming To Her Daughter

01:32 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Mark Zuckerberg Teaches Swimming To Her Daughter

ప్రపంచంలో అత్యంత ప్రభావితమైన వ్యక్తులను చెప్పుకోవాల్సివస్తే, ఫేస్ బుక్ అధిపతి జుకర్ బర్గ్ ని ప్రస్తావించాల్సిందే. సోషల్ మీడియా రంగంలో ఫేస్ బుక్ ని శక్తివంతంగా మలిచిన ఈయన వార్తల్లో లేని రోజంటూ ఉండదు. అయితే, తాజాగా ఓ చిత్రమైన అంశంతో వార్తల్లో కెక్కారు. అదేమంటే, ఈ మధ్యన తండ్రి అయిన జుకర్ బర్గ్ తన నెలల బిడ్డకు ఈత నేర్పిస్తున్నాడట. దీనికి సంబంధించిన ఫోటోను తాజాగా ఆయన పోస్ట్ చేశాడు.

'నెలల నిండిన తన బిడ్డకు ఈత నేర్పుతున్నా. నా బిడ్డను ఈత కొలను వద్దకు తీసుకొస్తే నీళ్లలో తడవటానికి ఇష్టపడింది' అంటూ తన కూతురు ఈతకు సంబంధించిన వివరాల్ని వెల్లడించటమే కాకుండా అందుకు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేశారు. నడుము లోతున్న స్విమ్మింగ్ ఫూల్ లో ముద్దులొలికే బుజ్జి జుకర్.. తండ్రి చేతుల్లో నిశ్చింతగా నీళ్లల్లో తడుస్తున్న ఫోటో పలువుర్ని ఆకర్షిస్తోంది. నెలలు కూడా నిండని కూతురికి ఈత నేర్పాలన్న జుకర్ బర్గ్ ఉత్సాహం.. దానికి అతని కూతురు రియాక్ట్ అవుతున్న తీరు సహజంగానే అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. ఈ ఫోటోను పోస్ట్ చేసిన కాసేపటికి లక్షల కొద్దీ లైక్స్ వచ్చాయంటే, ఎంతగా ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు.

English summary

Facebook CEO Mark Zuckerberg teaches swimming to his cute little daughter Max. He posted this awesome pic on facebook and it gets huge response in Facebook