చిన్నారుల ఆరోగ్యం కోసం జుకర్ బర్గ్ భార్య 20 వేల కోట్లు సాయం(వీడియో)

Mark Zuckerberg wife Priscilla Chan giving 20 thousand crores for children health

12:04 PM ON 23rd September, 2016 By Mirchi Vilas

Mark Zuckerberg wife Priscilla Chan giving 20 thousand crores for children health

సోషల్ మీడియా రంగంలో దూసుకుపోతూ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందిస్తున్న ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సేవలోనూ ముందుంటున్నారు. ఇప్పుడు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇప్పటికే తన సంపదలో 99శాతం చారిటీకి ఇస్తానని ప్రకటించిన ఆయన, తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వ్యాధులు లేని సమాజ నిర్మాణ కోసం 3 బిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.20 వేల కోట్ల పై మాటే) ఖర్చు చేయనున్నట్లు జుకర్, ఆయన సతీమణి ప్రిసిల్లా చాన్ ప్రకటించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో చాన్ జుకర్ బర్గ్ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో జుకర్ దంపతులు ఈ ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా ప్రిసిల్లా మాట్లాడుతూ, చిన్నారులకు వచ్చే వివిధ రకాల వ్యాధులను నిర్మూలించేందుకు కృషి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. చిన్న వయసులోనే వ్యాధుల బారిన పడి.. జీవితాన్ని కోల్పోతున్న చిన్నారుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ శతాబ్ధం చివరి నాటికి చిన్నారుల్లో వ్యాధులంటే ఏమిటో తెలియకుండా ఉండాలన్నారు. జుకర్ మాట్లాడుతూ, మన చిన్నారులకు మంచి, ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఇద్దామని పిలుపునిచ్చారు. తమ ప్రాజెక్టులో భాగంగా.. చాన్ జుకర్ బర్గ్ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో అనేక పరిశోధనలు చేపట్టనున్నారు. ఇందుకోసం వచ్చే పదేళ్లలో 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నారు.

తొలి దశలో భాగంగా 600 మిలియన్ డాలర్లతో శాన్ ఫ్రాన్సిస్కోలో చాన్ జుకర్ బర్గ్ బయోహబ్ ఏర్పాటు చేస్తారు. యూసీఎస్ఎఫ్, స్టాన్ ఫర్డ్, కాలిఫోర్నియా యూనివర్శిటీ భాగస్వామ్యంలో ఈ బయోహబ్ లో పరిశోధనలు చేపడతారు. చాన్ జుకర్ బర్గ్ ఇనిషియేటివ్ పై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ హర్షం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: స్టార్ హీరో కూతురు ఫోటోలు చూస్తే దిమ్మతిరగాల్సిందే(ఫోటోలు)

ఇది కూడా చదవండి: 'ఇక నుంచి పాడను అంది' అంతే ఈ లెజండరీ సింగర్ ని చంపేశారు!

ఇది కూడా చదవండి: 6 అంతస్తుల నుంచి దూకేసాడు.. ఇంతకీ ఏమైంది?(వీడియో)

English summary

Mark Zuckerberg wife Priscilla Chan giving 20 thousand crores for children health. Facebook CEO Mark Zuckerberg's wife Priscilla Chan donating 20 thousand crores for poor children.