పీఎంగా నితీశ్‌,డిప్యూటీ పీఎం గా కేజ్రీ!

Markandey Katju Says That Nithish Kumar Should Be Next PM

11:41 AM ON 3rd May, 2016 By Mirchi Vilas

Markandey Katju Says That Nithish Kumar Should Be Next PM

ఇదేమిటి అనుకుంటున్నారా! ఉన్నట్టుండి ఈ ప్రతిపాదన తెరమీదికి వచ్చేసింది.ఇది ఏ రాజకీయ పార్టీయో,రాజకీయ నేతో, విశ్లేషకుడో అన్నది కానే కాదు.మరి అన్నదెవరంటే, ఓ మాజీ న్యాయ మూర్తి... ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మాజీ ఛైర్మన్‌, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. భారత తర్వాతి ప్రధానమంత్రి నితీశ్‌కుమార్‌ కావాలని, ఉప ప్రధాన మంత్రిగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. నితీశ్‌, కేజ్రీవాల్‌లు వ్యక్తిగతంగా ఎప్పుడూ ఎలాంటి ఆరోపణలూ ఎదుర్కొన్నట్లు తాను వినలేదని ఆయన వ్యాఖ్యానించారు. సాధారణంగా తాను ఎప్పుడూ రాజకీయ నాయకుల్ని విమర్శిస్తూనే ఉంటానని, వీరిని కూడా తాను గతంలో కొన్ని సందర్భాల్లో విమర్శించానని కట్జూ అన్నారు. అయితే దేశంలో ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఉంది కాబట్టి ఉన్నంతలో ఉత్తములను ఎన్నుకోవాల్సిన అవసరం ప్రజలదేనని ఆయన అభిప్రాయపడ్డారు. 2019ఎన్నికలకు ఈ ప్రతిపాదన జోరందుకోనుందా!

ఇవి కూడా చదవండి:యశోదా ఆసుపత్రికి 47 లక్షల ఫైన్

ఇవి కూడా చదవండి:సల్మాన్‌ పై కత్రినా షాకింగ్ కామెంట్స్

English summary

Supreme Court Ex- Justice Markandey Katju said that Bihar Chief Minister Nitish Kumar Would Be Next Prime Minister Of India an Delhi Chief Minister Aravind Kejriwal Should Be Next Deputy Prime Minister Of India. He posted this post on his Facebook.